DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ డిజిటల్ టెక్ మీట్ లో 4 అవార్డులు ఏపీ పోలీసు కే

*AP Police grabs 4 awards at Digital Tech Natl Meet*

*డిజిటల్ వినియోగం లో ఏపీ పోలీస్ దేశానికి ఆదర్శం* 

*పోలీస్ శాఖ కు సీఎం వైఎస్ జగన్ అభినందనలు వెల్లువ*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 27, 2021  (డి ఎన్ ఎస్):* సాంకేతిక పరం మైన వినియోగం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పొలిసు శాఖా దేశానికి

ఆదర్శంగా నిలుస్తోంది. జాతీయస్థాయిలో వివిధ శాఖలలో  టెక్నాలజీ వినియోగం పై డిజిటల్ టెక్నాలజి సభ  గ్రూప్ దేశంలో ప్రకటించిన 12  అవార్డులలో నాలుగు అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక పోలీస్ శాఖ ఎపి పోలీస్ శాఖ గా అందరు అభినందిస్తున్నారు. నాలుగు టెక్నాలజీ అవార్డులను ఎపి డి‌జి‌పి గౌతం సవాంగ్ అందుకున్నారు. 
వీటిల్లో

దిశ మొబైల్ అప్లికేషన్, దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, సెంట్రల్ లోక్ అప్ మానిటరింగ్ సిస్టంకు మరియు 4S4U  అవార్డులను ఏపీ పోలీస్ సొంతం చేసుకుంది. 

మహిళలు, చిన్నారులు రక్షణే  ద్యెయంగా ప్రవేశపెట్టిన  దిశ మొబైల్ అప్లికేషన్  ఇప్పటికే వివిధ జాతీయ స్థాయి సంస్థలు ప్రకటించిన  జాతీయ స్థాయి అవార్డులలో ఇది

నాల్గవది.

దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్  వివిధ జాతీయ స్థాయి సంస్థల నుండి ఇప్పటికే  రెండు అవార్డులను సొంతం చేసుకుని  ప్రధాన మంత్రి నుండి ప్రత్యేకంగా ప్రశంసలను అందుకుంది.

సెంట్రల్ లాక్ అప్ మానిటరింగ్ సిస్టం: పారదర్శకత, జవాబుదారీతనం,  మానవహక్కుల పరిరక్షణే  ధ్యేయంగా రాష్ట్రంలోని ప్రతి

పోలీస్ స్టేషన్ లోని లాకప్ లో ఆడియో, వీడియో, నైట్ విజన్లతో కూడిన   సీసీ కెమెరాల ఏర్పాటుకు గాను రెండవ సారి జాతీయ స్థాయిలో అవార్డును సొంతం చేసుకున్న ఏపీ పోలీస్ శాఖ

4S4U : సామాజిక మద్యమాల్లో మహిళల పైన జరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణ కోసం ఏపి పోలీస్  ప్రవేశపెట్టిన 4S4U మరోసారి జాతీయ స్థాయి అవార్డు

దక్కించుకుంది. 

కేవలం 13 నెలల కాల వ్యవధిలో 112 అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించిన ఏపీ పోలీస్ శాఖ

అందుబాటులో ఉన్న అత్యంత  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు పారదర్శకత, జబాబుదారీతనం, సత్వరన్యాయం, త్వరితగతిన  

మెరుగైన సేవలను అందిస్తున్న సిబ్బందిని అభినందించిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam