DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సామాజిక బాధ్యతతో ఓటు వేయాలి: ఎస్ఈసి రమేష్

*ఎన్నికల ప్రవర్తనా నియమావళి పగడ్బందీగా అమలు*

*భయబ్రాంతులకు గురి చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం*

*రాష్ట్ర ఎన్నికల అధికారి డా. ఎన్. రమేష్ కుమార్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 1, 2021  (డి ఎన్ ఎస్):* ఎన్నికలలో సామాజిక బాధ్యతతో ఓటు వేయాలని

రాష్ట్ర ఎన్నికల అధికారి డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.  సోమవారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధిక శాతం ఓటింగ్ నమోదు జరిగిందని అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ నమోదు

శాతం పెంచాలని చెప్పారు. మొత్తంగా ఎన్నికల్లో పర్యవేక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ నెల 7వ తేదీ నాటికి ఓటర్ల స్లిప్పులు పంపిణీ పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి సూచించామన్నారు

    పురపాలక ఎన్నికలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేస్తామన్నారు.   ఎన్నికల లో పాల్గొనే

అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయని రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రచారానికి ఐదు మందికి మించి వెళ్ళకూడదు అన్నారు రాజకీయ పార్టీల సమావేశాలకు రోడ్షోలకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టంచేశారు ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించడానికి  మొబైల్ బృందాలను

ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ బృందాలు క్రియాశీలకంగా రాత్రివేళల్లో పర్యవేక్షిస్తారని చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీ పై నిఘా బృందాలను నియమించామని చెప్పారు ఎక్సైజ్ సిబ్బంది బార్ల యజమానులను ప్రభావితం చేసినట్లు రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

    వివిధ కారణాల వలన నామినేషన్ వేయలేని

అభ్యర్థులకు మళ్లీ నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచార మాధ్యమాల సేవలను ప్రశంసించారు. పోలింగ్ రోజున కోవిడ్ నిబంధనలు అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ మనీష్  కుమార్ సిన్హా, డి. ఐ. జి. కె. రంగారావు, జివిఎంసి కమిషనర్ నాగలక్ష్మి

తదితరులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam