DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలి: ఎస్ఈసి

*SEC Ramesh meets All party team over Munci Polls*

*ఎస్ఈసి నిబంధనలపై పార్టీల భిన్న వైఖరి*

బయటకి పంపేస్తానంటూ టీడీపీ నేతపై ఎస్ఈసి ఫైర్*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 1, 2021  (డి ఎన్ ఎస్):* త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా. నిమ్మగడ్డ రమేష్

కుమార్ గుర్తించిన అన్నిరాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా నిబంధనలపై పార్టీలు భిన్న స్వరాలూ వినిపించాయి.  రాజకీయ ప్రక్రియ నుంచి వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థి, పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు వ్యవహారించొద్దని... పథకాల పేరుతో

ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేశారు.

ఒక దశలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఎస్ ఈ సి తో వాగ్విదానికి దిగడంతో అయన సీరియస్ అయ్యినట్టు తెలుస్తోంది. మిమ్మల్ని బయటకు పంపేస్తా అనేంతవరకూ వాగ్వాదం సాగినట్టు సమాచారం. 
పురపాలక ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల సేవలపై రాష్ట్ర ఎన్నికల సంఘం

ఆంక్షలు విధించింది. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో కమిషన్ మాట్లాడిందని వెల్లడించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే వార్డు వాలంటీర్లపై ఫిర్యాదులు కమిషన్‌కు వచ్చాయని తెలిపారు. రాజకీయ కార్యకలాపాల్లో

పాల్గొన్నట్లు తేలితే స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం వాలంటీర్లపై కఠినమైన చర్యలు అవసరమని ఎస్ఈసీ అభిప్రాయపడ్డారు. వార్డు వాలంటీర్లను రాజకీయ ప్రక్రియ నుంచి పూర్తిగా దూరంగా ఉంచాలని ఆదేశించారు.

'అభ్యర్థి, పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు ప్రచారంలో పాల్గొనకూడదు. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదు.

ఓటరు స్లిప్పుల పంపిణీని వార్డు వాలంటీర్లకు అప్పగించవద్దు. వార్డు వాలంటీర్ల కదలికలను నిశితంగా పరిశీలించాలి. లబ్ధిదారుల డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున వాలంటీర్ల ఫోన్లను నియంత్రణలో ఉంచాలి. ఉల్లంఘిస్తే మోడల్ ప్రవర్తనా నియమావళి తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తాం. వాలంటీర్లను సాధారణ బాధ్యతల్లో

నిర్వహించడంలో ఎలాంటి అడ్డంకులు లేవు అని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam