DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగర వాణిజ్య పెట్టుబడులకై ప్రపంచ దేశాలకు మోడీ ఆహ్వానం 

*మేరీటైమ్ ఇండియా సమిట్- 2021 ప్రారంభం లో ప్రధాని* 

*ప్రతిష్టాత్మకంగా సదస్సును ప్రారంభించిన ప్రధాని మోడీ.*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 2, 2021  (డి ఎన్ ఎస్):* సాగర ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్నిచ్ఛే దిశగా భారత్ దేశం అడుగులు వేస్తోందని, దీనికి

మేరీటైమ్ ఇండియా సమిట్- 2021  సమ్మేళనం సాక్షిగా ప్రపంచదేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం పలికారు. మంగళవారం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేరీటైమ్ ఇండియా సమిట్- 2021  ను ఆయన వర్చువల్ విధానంలో వీడియో ద్వారా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 
 
ఈ రంగం లోని అనేక మంది

భాగస్వాముల ను ఒక చోటు కు చేర్చింది.  ఈ నేపథ్యం లో సాగర ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్ని ఇచ్చే దిశ లో మనం సమష్టి కృషి తో గొప్ప సాఫల్యాన్ని సాధించగలం అన్నారు. 

ఈ రంగం లో భారతదేశం సహజంగానే అగ్రగామి గా నిలిచిందన్నారు. మన దేశానికి సుసంపన్న సముద్ర చరిత్ర ఉంది.  మా తీరాలలో అనేక నాగరకత లు పుష్పిపంచి ఫలించాయి. వేల

సంవత్సరాలు గా మా ఓడరేవు లు ప్రముఖ వాణిజ్య కేంద్రాలు గా ఉంటూ వస్తున్నాయి.  మా తీరాలు మమ్ములను ప్రపంచం తో జోడించాయన్నారు. 

మా ప్రగతి పయనం లో భాగస్వామ్యం కోసం భారత్ కు ప్రపంచ దేశాలను ఈ మేరీటైమ్ ఇండియా సమిట్ మాధ్యమం ద్వారా ఆహ్వానించారు. 

సరికొత్త మౌలిక సదుపాయాల కల్పన కు సంబంధించి వధావన్‌,

పారాదీప్‌, కాండ్ లా లోని దీన్‌ దయాళ్‌ రేవు వంటి భారీ రేవుల లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. అలాగే మునుపెన్నడూ లేని రీతి లో జలమార్గాల అభివృద్ధి కి మా ప్రభుత్వం కృషి చేస్తోంది.  సరుకు ల రవాణా లో దేశీయ జలమార్గాలు చౌకైనవే కాకుండా పర్యావరణ హితకరమైనటువంటివి.

 ఆ మేరకు 2030 వ సంత్సరానికల్లా  దేశం లో 23 జలమార్గాలను అందుబాటు లోకి తీసుకు రావాలని మేం సంకల్పించాం.  మౌలిక సదుపాయాల పెంపు, ప్రయాణానుకూల మార్గాభివృద్ధి, నౌకా గమన ఉపకరణాలు, నదుల సమాచార వ్యవస్థ సదుపాయ కల్పన తదితరాల ద్వారా మా సంకల్పాన్ని సాకారం చేయనున్నాం.  దీంతోపాటు బాంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌, మ్యాంమార్‌

లతో ప్రాంతీయ సంధానానికి ఉద్దేశించిన తూర్పు జలమార్గ అనుసంధానం- రవాణా గ్రిడ్‌ వల్ల ప్రాంతీయ వాణిజ్యం, సహకారం ప్రభావాన్వితం గా బలోపేతం అవుతాయి.

మేరీటైమ్ ఇండియా సమిట్- 2021 లో కేంద్ర పోర్టులు నౌకా జలరవాణా మంత్రి మన్షుక్ మండవీయా ప్రారంభోత్సవ ప్రసంగం చేసారు. 

ఈ వీడియో భేటీ లో కేంద్రమంత్రి ధర్మేంద్ర

ప్రధాన్‌, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గుజరాత్ ముఖ్యమంత్రి , ఫిక్కి అధ్యక్షులు, అన్ని మేజర్ పోర్టుల చైర్మన్ లు ఉన్నతాధికారులు, పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam