DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ కు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులు 30 కి పై మాటే

*Dozens of Projects given by BJP Govt to Vizag within 6 years*

*కేంద్ర బీజేపీ భాగస్వామ్యం లేకుంటే విశాఖ అభివృద్ధి జరిగేనా?*  

*మోడీ కి ముందు, తర్వాత కేంద్రపాలకుల ఘనకార్యమేంటి?*

*స్మార్ట్ సిటీ నుంచి సమీర్ వరకూ జాతీయ స్థాయి ప్రాజెక్ట్ లు ఎన్నో*

*IIM, IIPE, మెడిటెక్ పార్క్, మెట్రో, రైల్వే జోన్, ఈఎస్ఐ, . .*

*ప్రసాద్,

అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, వేగన్ హాలింగ్ వర్క్ షాప్. .* 

*ఈ ప్రాజెక్ట్ లపై చర్చకు సిద్దమేనా? పార్టీలకు జివిఎల్ ఆహ్వానం. .*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 3, 2021  (డి ఎన్ ఎస్):* *కేంద్రం లో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం గానీ, మద్దతుగానీ

లేనట్టయితే విశాఖపట్నం నగరాభివృద్ధి జరిగి ఉండేదా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు జివిఎల్ నర్సింహారావు ఇదే అంశాన్ని లక్ష్యంగా చేసుకుని విశాఖపట్నం నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలను ఇతర రాజకీయ పార్టీలపై ప్రయోగిస్తున్నారు. విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన నరేంద్ర

మోడీ తొలిసారి భారత ప్రధాన మంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి, నేటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా విశాఖపట్నం కు కేటాయించిన ప్రాజెక్ట్ లను బహిర్గత పరుస్తూ బ్రోచర్లు కూడా విడుదల చేసారు. వాటిల్లో ప్రకటించిన అంశాల ప్రకారం ప్రధానిగా నరేంద్ర మోడీ ముందు విశాఖ అభివృద్ధి, మోడీ ప్రధానిగా చేపట్టిన అభివృద్ధి

అనే అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

గత ఎన్నికల్లో బీజేపీ కి ఏ చట్టసభలోనూ ఆంధ్ర ప్రదేశ్ నుంచి సభ్యులు ( ఎమ్మెల్యే లుగానీ, ఎంపీ లు గానీ) లేరన్నారు. అయినప్పడికే భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ గానీ ఆంధ్ర అభివృద్ధి, ప్రత్యేకించి విశాఖపట్నం కి లక్షల కోట్లు ప్రాజెక్ట్ లు

కేటాయించాలి అనే పాటుపడ్డాయని,  ఓటు వెయ్యలేదు కదా, వీళ్ళకి మనం సాయం చెయ్యకూడదు అని ఏ రోజు అనుకోలేదన్నారు. 

విశాఖపట్నం అభివృద్ధి బీజేపీ  ప్రభుత్వం కేటాయించిన ప్రాజెక్టులు, నిధులు ఇవే:  .. 

1 . స్మార్ట్ సిటీ :  మోడీ ప్రధాని గా తొలిసారి భాద్యతలు చేపట్టిన తోలి నాళ్ళల్లోనే  విశాఖ పట్నం ను

స్మార్ట్ సిటీ గా ప్రకటించారు. దీనిలో భాగంగా నగరం లో భూగర్భ విద్యుత్ పనులు, బీచ్ సుందరీకరణ, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ మెరుగు కై, నగర సుందరీకరణకై పచ్చదనం, చెట్లు పెంపు, జివిఎంసి స్కూళ్ల ల్లో లాబ్స్, మంచినీటి వసతులు, ఉడా పార్కు పునరుద్ధరణ, మల్టి లెవెల్ కార్ పార్కింగ్ వ్యవస్థ కు, వ్యర్థ పదార్ధాల సమగ్ర నిర్వహణకై, పబ్లిక్

టాయిలెట్ల నిర్మాణం, సోలార్ రూఫ్ టాప్ పధకం, నిరంతర నీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా, స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నలింగ్, ఆధునిక విపత్తు నిర్వహణ, 22 కిమీ జాలరిపేట లో డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరణ,  ప్రత్యేకించి నగరాభివృద్ధి కోసం రూ. 2350 కోట్లు కేటాయించింది. 

2 . సిజిహీస్ వెల్ నెస్ సెంటర్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల

చిరకాల స్వప్నమైన సి జి హి ఎస్  పధకారాన్ని డిసెంబర్ 2016 లో ప్రారంభించారు. ఈ పధకం ద్వారా విశాఖ ప్రాంతం లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, తదితరులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. 
 
3 . మెడ్ టెక్ పార్క్: మన రాష్ట్రంలో, దేశంలోనూ వైద్య చికిత్స అందించేందుకు ఉపయోగించే వైద్య పరికరాల తయారీ

పరిశ్రమలు లేకపోవడంతో వైద్య సామాగ్రిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దాంతో ఆర్ధిక భారం కూడా పెరిగిపోయింది.  దీనికి తగిన పరిష్కారం చూపించేందుకు ఈ వైద్య పరికరాల తయారీ సంస్థలను విశాఖ పరిసరాల్లోనే ఏర్పాటు చేసేందుకు మెడ్ టెక్ పార్క్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పడికే సంస్థలు ఏర్పాటు జరిగి,

ఉత్పత్తికూడా మొదలైంది. గత ఏడాది కోవిడ్  కష్టకాలంలో అత్యంత సురక్షితమైన మాస్క్ లు, పీపీఈ కిట్ లు, పెద్ద సంఖ్యలో తయారు చేసి, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సరఫరా చెయ్యడం జరిగింది. 

4 .ఈఎస్ ఐ ఆసుపత్రి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబాల వైద్య అవసరాల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో రూ 500 కోట్ల నిధులతో 350  పడకల

సూపర్ స్పెషలిటీ సేవలు కల్గిన ఈ ఎస్ ఐ ఆసుపత్రిని విశాఖలోని షీలా నగర్ లో (2014 -19 మధ్య కాలంలో) ప్రారంభించడం జరిగింది. నాటి కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ ఈ ఆసుపత్రి కి శంకు స్థాపన చేసారు.

5 . సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ : విశాఖపట్నం లోని ప్రభుత్వ మానసిక రోగుల చికిత్సా కేంద్రం  (మెంటల్ కేర్ ఆసుపత్రి ) కు

కేంద్ర ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ హోదా కేటాయించింది. ఈ కేంద్రం దేశంలోనే 23 వ ఆసుపత్రి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి మానసిక వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, సహాయకులు, తదితర మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి కి నిధులు, అవసరమైన నిధులు, పూర్తి సహాయ సహకారాలు అందించబడతాయి.

6 . విశాఖ్ రిఫైనరీ అభివృద్ధి: రూ. 20,128 కోట్ల

నిధులతో  కేంద్ర ప్రభుత్వ నవరత్నాల్లో ఒక విభాగమైన ఆయిల్ పరిశ్రమ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ - విశాఖపట్నం పరిశ్రమ (విశాఖ్ రిఫైనరీ ) అభివృద్ధి కి కేటాయింపులు జరిగాయి. దీనిలో భాగంగా 8 .3 ఎంఎంటిపిఏ  సామర్థ్యం నుంచి 15 ఎంఎంటిపిఏ  సామర్థ్యం కు పెంచే విధంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి లీజ్ కు

తీసుకున్న 105 ఎకరాల స్థలంలో ఈ అభివృద్ధి పనులు ఏర్పాటు చెయ్యడం జరుగుతోంది. 

7 . విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ : తూర్పు కోస్తా పరీవాహక ప్రాంతంలో పారిశ్రామిక రంగం ను మరింత అభివృద్ధి పరిచేందుకు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం నుంచి చెన్నై వరకూ

గల ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి  ఈ ప్రాంతంను విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గా నెలకొల్పేందుకు ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ ( ఈ సి ఈ సి ) మొదటి దశ కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో చిత్తూరు ( శ్రీకాళహస్తి), విశాఖపట్నం, కడప కేంద్రంలుగా అమలవుతున్న ఈ ప్రాజెక్ట్ వలన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, కార్మికుల

జీవన, సామజిక సౌకర్యాలు మెరుగుపడి, ఉత్పాదక, ఎగుమతి రంగాల్లో నూతన పెట్టుబడులు పెరిగి కొత్తగా 1,80,000 ఉద్యోగాలు వస్తాయి. 2045 నాటికి మొత్తం 1 కోటి  40 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. 

8 . విశాఖ ఫిషింగ్ హార్బర్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో  విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ను ఆర్ధిక కార్యకలాపాల కేంద్రంగా అభివృద్ధి

పరుస్తామని కేంద్రం ప్రకటించింది. దీనివల్ల మత్స్య కారులకు మెరుగైన సదుపాయాలు, అవకాశాలు లభిస్తాయి. 

9 . పీఎం ఆవాస్ యోజన : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పధకం లో భాగంగా విశాఖపట్నం లో ఇల్లు లేని పేదలకు ఇప్పడికే 58000 ఇల్లు నిర్మించడానికి రూ. 963 కోట్లు నిధులు విడుదల చేసింది. 

10 . పర్యాటక రంగం:  పర్యాటక రంగాన్ని

అభివృద్ధి పరిచే పధకంలో భాగంగా కేంద్ర ప్రభుతం విశాఖపట్నం ను ఎంచుకుంది. అత్యంత ప్రసిద్ధికెక్కిన సింహాచలం లోని శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం పరిసరాలను మౌలిక వసతులు కల్పించేందుకు ప్రసాద్ ( ఫిలిగ్రిమేజ్ రెజ్యూవినేషన్ అండ్ అగ్మెంటేషన్ ) లో కేంద్ర ప్రభుత్వం రూ. 53 కోట్లు కేటాయించింది. 

11 .

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చొరవతోనే విశాఖపట్నం లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ( అంతర్జాతీయ నౌక విన్యాసం) జరిగింది. తద్వారా విశాఖపట్నం కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 

12 .విస్తాడోమ్ కోచ్ లు:  పర్యాటక రంగంలో విశాఖపట్నం ను మరింత అభివృద్ధి పరిచేందుకు విశాఖపట్నం - అరకు రైలు కు

విస్తాడోమ్ కోచ్ లు ఏర్పాటు చేసారు. 

జాతీయ స్థాయి విద్య సంస్థలు - కేంద్రాలు. .

విశాఖపట్నం ను దేశంలోనే అత్యున్నత అభివృద్ధి చెందిన నగరాల చెంత నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం పలు జాతీయ స్థాయి విద్యా సంస్థలు, కేంద్రాలను కేటాయించింది.  

13 .ఐఐఎం : విశాఖపట్నం కేంద్రంగా జనవరి 17, 2015 న నాటి కేంద్ర మానవ

వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ( ఐఐఎం) సంస్థకు శంకు స్థాపన చేసారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ( ఎయు) లో నడుస్తోంది. ఇప్పడికే రెండు బ్యాచ్ లు విడుదల అయ్యాయి. దేశంలోనే మొదటి ఐదు స్థానాల్లో విశాఖ ఐఐఎం నిలిచింది. ఈ సంస్థ భవన నిర్మాణం కోసం 241.5 ఎకరాల భూమిలో రూ. 688.73 కోట్లను

కేటాయించింది.   

14 .స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ : కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖా ఆధ్వర్యవంలో 8 ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల సహకారం తో విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతం లో  స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సంస్థ ద్వారా 10 వ తరగతి నుంచి డిగ్రీ లు చదివిన వారి వరకూ

నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణా పొందుతున్నారు. ఇప్పడికే 3000 కి పైగా శిక్షణ పొంది, ఉపాధి పొందారు. 

15 .సమీర్ : .సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ( సమీర్ ) ప్రాజెక్ట్ లో భాగంగా రూ. 80 కోట్ల నిధులతో దేశంలోనే మొట్టమొదటి సెంటర్ ఫర్ ఎలక్ట్రో మాగ్నెటిక్

ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ( ఈ 3 ) టెస్ట్ సెంటర్ ను, సమీర్ ను విశాఖపట్నం లోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఏర్పాటు తో ప్రత్యక్ష ఉపాధితో పాటు గా అనుబంధ పరిశ్రమల ఏర్పాటు జరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. 

16 .ఎగుమతి తనిఖీ మండలి ల్యాబ్: 2015 లో నాటి కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్

విశాఖపట్నం లోని గంభీరం లో ఎగుమతి తనిఖీ మండలి పరీక్ష ప్రయోగ శాల ను ప్రారంభించారు. సముద్ర ఉత్పత్తుల నాణ్యత పరీక్ష కేంద్రానికి శంకు స్థాపన చేసారు. ఇప్పడివరకు మత్స్య ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు, పీతలు ఎగుమతి చెయ్యడానికి లాబ్స్ ఆంధ్ర లో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నందున ఈ కేంద్రాన్ని విశాఖలో

నెలకొల్పుతున్నారు. 

17 . జాతీయ రహదారులు అభివృద్ధి :  విశాఖపట్నం నగరం మధ్య లో నుంచి వెళ్తున్న జాతీయ రహదారిని అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి లో నిర్మాణాలు చేస్తోంది. రూ. 2300 కోట్ల నిధులతో రహదారి నిర్మాణాలు ఇప్పడికే మొదలు పెట్టింది. 

18 . సబ్బవరం నుంచి  షీలా నగర్ వరకూ 12 .7 కిమీ

దూరం పోర్ట్ అనుసంధాన రోడ్డు నిర్మాణం కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

విశాఖపట్నం విమానాశ్రయం అభివృద్ధి:

19 . కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వ విశాఖపట్నం అభివృద్ధి పై ప్రత్యేక ద్రుష్టి పెట్టింది అనేందుకు నిదర్శనం విశాఖపట్నం విమానాశ్రయం అభివృద్ధి. అంతర్జాతీయ స్థాయి లో తీర్చి

దిద్దెందుకు ఎన్నో చర్యలు తీసుకుంది. శ్రీలంక, మలేషియా, దుబాయ్, సింగపూర్, తదితర దేశాల నుంచి నేరుగా విమాన సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. 2015 కు ముందు కేవలం 6 బేలు మాత్రమే ఉన్న విశాఖ పట్నం విమానాశ్రయం లో మరో 6 బె లను అదనంగా కేటాయించి, విమానాల రాకపోకలను విస్తృత పరిచింది. అదనంగా రూ. 55 కోట్లతో అదనపు సదుపాయాలు

కల్పిస్తోంది. 

20 . డొమెస్టిక్ ఎయిర్ కార్గో టెర్మినల్ ఏర్పాటు: మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు సరకు రవాణా చేసేందుకు దేశీయ ఎయిర్ కార్గో టెర్మినల్ ను మరింత అభివృద్ధి పరిచింది కేంద్రం. విశాఖ నుంచి ఫార్మా సంస్థల ఉత్పత్తులు, మత్య్స సంపద, తదితర ఉత్పత్తులు సుమారు 5000 మెట్రిక్ టన్నుల కార్గో లావాదేవీలు

జరుగుతున్నాయి.  

రైల్వే లకు సువర్ణ సదుపాయాలు:

విశాఖపట్నం ప్రాంత చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను కేటాయించింది కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వమే. గత పాలకులు ఈ జోన్ 
డిమాండ్ ను అసలు ఖాతరు చెయ్యలేదు. దీనికోసం 2021 -22 కేంద్ర బడ్జెట్ లో రూ. 175 కోట్లు నిధులు

కేటాయించింది. 

21 . విశాఖ నుంచి పారాదీప్ వరకూ ప్రత్యేక రైలు, దువ్వాడలో గరీబ్ రథ్ కు హల్ట్, విశాఖ నుంచి ఢిల్లీ కి  ఏపీ ఎక్స్ ప్రెస్, విశాఖ - తిరుపతి మధ్య సువిధ ప్రత్యేక రైళ్లు, వారణాసికి రైలు, మంజూరు చేసింది కేంద్రం. 
 
22 . రూ. 213 .71 కోట్ల నిధులతో వడ్లపూడి వద్ద వాగన్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్

ఏర్పాటు, 

23 . విశాఖపట్నం రైల్వే డివిజన్ అభివృద్ధికి రూ. 695 కోట్లకు కేటాయించింది. 

మల్టి మోడల్ లాజిస్టిక్ పార్క్ :

24 . కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (కాంకోర్) ద్వారా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి 30 సంవత్సరాలు లీజు తీసుకున్న 108 ఎకరాల స్థలంలో రూ. 400 కోట్ల నిధులతో

మల్టి మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ను ఏర్పాటు చేసారు.  ప్రస్తుతం రోడ్డు, రైలు అనుసంధానం గల ఈ పార్క్ నుంచి నెలకు 60000 మెట్రిక్ టన్నులకు పైగా సరకు రవాణా జరుగుతోంది. 
రాష్ట్ర విభజన చట్టం లో లేనప్పడికి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం పై ఉన్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఈ పార్క్ ను కేటాయించింది.

25 . విశాఖపట్నం రైల్వే

డీజిల్ లోకో షెడ్ వసతుల కోసం రూ. 53.14 కోట్లు నిధులు, ఎలక్ట్రికల్ లోకో షెడ్ అభివృద్ధి కోసం రూ. 19 .57 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.     
    
ఇవి కాక ప్రతి ప్రాజెక్ట్ లోనూ విశాఖపట్నం కు కచ్చితంగా కేటాయిస్తున్నారని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam