DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ శారదా పీఠానికి వెళ్లిన సిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ 

*వామ పక్షాలకూ ఆశ్రమాలు, పీఠాధిపతి భక్తి పుట్టుకొచ్చిందా?*

*నారాయణ వెళ్ళింది స్వామి ఆశీస్సులు కోసమా లేక ఓట్లడుక్కోడానికా?*

*వెళ్ళింది భక్తితోనా? ఓట్లు కోసమా? ఎన్నికల్లో పీఠాధిపతి ఓటేస్తారా?*    
 
*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 3, 2021

 (డి ఎన్ ఎస్):* హిందూ ధర్మం, దేవీ దేవతలు, ఆశ్రమాలు, పీఠాధిపతులు అంటే అస్సలు పొసగని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నేతకు ఒక్కసారిగా అమాంతం భక్తి పుట్టుకొచ్చిందనుకుంటా.  త్వరలో జరుగనున్న గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రచారం చేస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ కు ఒక్కసారిగా హిందూ

పీఠాధిపతులపై అమాంతం భక్తి పుట్టుకొచ్చినట్టుంది. బుధవారం ప్రచారం లో భాగంగా విశాఖపట్నం శివారు ప్రాంతమైన చినముషిడివాడ గ్రామంలో సిపిఐ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తూ, అక్కడే ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠంలోపలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతిని దర్శించేందుకు వెళ్లారు. నారాయణ రాకతో ఆశ్రమంలో సభ్యులు ఆశ్చర్యపోయారు.

అనంతరం స్వామి ని దర్శించేందుకు లోపాలకి తీసుకు వెళ్లారు. స్వామిని చూసిన వెంటనే నారాయణ, అయన వెంట సిపిఐ మహిళా అభ్యర్థి ఇద్దరూ నమస్కారం చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వరూపానంద  నారాయణకు శాలువా కప్పి, అమ్మవారి ప్రసాదం కూడా అందించారు. ఈ దృశ్యాలను ఆశ్రమ సిబ్బంది వీడియో లో చిత్రీకరించి విడుదల చేసారు. అనంతరం ఇరువురు పలు

అంశాలపై చర్చించారు. 

సిపిఐ నారాయణ ఆశ్రమంలో స్వామి ని దర్శించింది ఆయన పై భక్తి తోనా లేక. . . అయన ఆశీస్సులు పొందిన వాళ్ళకి విజయం తప్పకుండా లభిస్తుంది అనే సెంటిమెంట్ తోనా అనేది తెలియాల్సి ఉంది. 
ఇదే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గతంలో తిరుమల కొండపైకి వెళ్లి శ్రీనివాసుని దర్శించుకున్న సమయంలో కూడా మీడియా

కెమెరాలకు చిక్కారు. 
అయితే కమ్యూనిస్ట్ లు ఎన్నడూ హిందూ దేవీదేవతలు ఆలయాలకు, పీఠాధిపతుల దగ్గరకు ఆశీస్సులు వెళ్లారు. అయితే రెండు సార్లు నారాయణే మీడియా కెమెరాకు దొరకడం గమనార్హం. 

ఆఖరికి ఈ కమ్యూనిస్ట్ హిందువుల నమ్మకాలను కూడా ఎన్నికల ప్రచారం కించపరిచాడా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam