DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీనియర్ పాత్రికేయులు నాగేశ్వరరావు మృతి పట్ల దిగ్భ్రాంతి

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 3, 2021  (డి ఎన్ ఎస్):* తూర్పు గోదావరి జిల్లా  రాజమహేంద్రవరం  ఆంధ్రభూమి ఎడిషన్ లో  సీనియర్ సబ్ ఎడిటర్ జి నాగేశ్వరావు (56) అకాల మరణం పట్ల సీనియర్ పాత్రికేయులు, ఏపీజేయు అడిషనల్ కార్యదర్శి పి రాజా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. గత మూడు నెలలుగా

 హైదరాబాదులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం గుండెపోటుతో  కాలం చేశారు. మూడు దశాబ్దాలుగా  ఆంధ్రభూమి కి సేవలు అందించారు. కరోనా లాక్డౌన్ ముందు లివర్ సమస్యతో బాధపడుతుండగా, స్థానిక ఆస్పత్రిలలో వైద్యం పొందారు. ఈలోగా కరోనా లాక్డౌన్ కారణంగా ఆంధ్రభూమి ప్రచురణ నిలిపివేయడం వంటి ఘటనలతో మెరుగైన వైద్యం కోసం బయటకు

వెళ్ళలేక పోయారు. మూడు నెలలు క్రితం లివర్ సమస్య తీవ్రతరం కావడంతో హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. లివర్ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. అయితే దానికి ముందుగా పరీక్షలలో 78 శాతం వాల్వ్ మూసుకుపోయినందున స్టంట్స్ వేశాక మూడు వారాలకు లివర్ మార్పిడి ఆపరేషన్ చేస్తామన్నారు. స్టంట్స్ వారం క్రితమే వేశారని

చెబుతున్నారు. ఈలోగా లివర్ మార్పిడి కి 20 లక్షల వరకూ ఖర్చవుతుందని, అంతభారం భరించలేని పరిస్థితి, అయితే తదుపరి వైద్య సహాయం లో జాప్యం జరగడం తో ఇలా జరిగింది. అమలాపురం సమీపంలో పేరూరు కు చెందిన నాగేశ్వరరావు గారికి భార్య, ఇద్దరు డిగ్రీచేసిన ఆడపిల్లలు వున్నారు. వారి కుటుంబానికి తగిన సహకారాన్ని అందించవలసిందిగా

ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam