DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గుంటూరు అర్బన్ ఎస్పీగా బాలుడు. .మాక్ ఏ విష్  .!

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 4, 2021  (డి ఎన్ ఎస్):* మేక్ ఏ విష్ కార్యక్రమం లో భాగంగా గుంటూరు అర్బన్ ఎస్పీగా రిహాన్ అనే చిన్నారి బాధ్యతలు నిర్వర్తించాడు. రిహాన్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. కాగా ఆ చిన్నారికి పోలీసులు కావాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలో ఆ బాలుడి

కోరిక మేరకు కొద్ది సేపు అర్బన్ పోలీసుగా బాధ్యతలు నిర్వహించారు. సామాజిక అంశాల పట్ల సున్నితంగా స్పందించే మనసు ఉన్న అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి స్వయంగా ఆ బాలుడిని తన ఛాంబర్ లో కూర్చోపెట్టారు. బాలుడిని తో పాటు తలిదండ్రులు నోయెల్ చాంద్, బీబీ నూర్జహాన్ లు కూడా గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ గారి కి కృతజ్ఞతలు

తెలియజేశారు. తన కోరిక నెరవేరినందుకు ఆ చిన్నారి చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. తమ చిన్నారి ముఖంలో నవ్వులు చూసి వారి తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam