DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాల్లో ఉత్సవాలకు ఊరంతా వేడుకలు జరుపుకోవాలి

*ప్రతి ఇంటికి మామిడి తోరణాలు ఉండాలి, ముగ్గులు వెయ్యాలి.*

*మందస బ్రహ్మోత్సవాల్లో చిన్న జీయర్ స్వామి సూచన*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*మందస / విశాఖపట్నం, మార్చి 4, 2021  (డి ఎన్ ఎస్):* ఒక గ్రామం లోని దేవాలయంలో ఉత్సవాలు జరుగుతుంటే.  ఆ ఊరంతా సంబరాలు, వేడుకలు

నిర్వహించుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు త్రిదండి చిన్న జీయర్ స్వామి సూచించారు. శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలో వేంచేసిన శ్రీవాసుదేవా పెరుమాళ్ళ స్వామి దేవాలయ 12 వ బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు అంటే. .ఆలయంలో వేంచేసిన స్వామి జన్మదినం

అని, ఆ వేడుకలకు ఊళ్లోని ప్రతి ఇంటి ముందు పేడనీళ్లతో కళ్ళాపు జల్లి, ముగ్గులు వేసి, ఇంటి గుమ్మాలకు పసుపు రాసి, మామిడి ఆకుల తోరణాలు కట్టడం ద్వారా మొత్తం ఊరంతటికి కళ వస్తుందన్నారు. గుమ్మాలకు పసుపు వ్రాయడం ద్వారా ఎటువంటి అశుచి, వైరస్ లు ఇలాంటివి ఇంట్లోకి ప్రవేశించవన్నారు. పూర్వం పెద్దలు ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలను

ఆధ్యాత్మికపరమైన అంశాలతో జోడించి, అందరిచేత ఆచరింప చేసేవారన్నారు. 

ఒక ఊళ్లోని ఆలయంలో బ్రహ్మోత్సవాలు, వేడుకలు జరుగుతుంటే. . . మొత్తం ఆ ఊరికే కళ వస్తుందని, ఒక పండగ వాతావరణం కలుగుతుందన్నారు. స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు దివి నుంచి దేవతలు వస్తారని, మహానుభావులు, సామాన్య భక్తులు వస్తారని, అలా

వచ్చేవారికి మామిడి తోరణాలతో ఊళ్ళో ని ప్రతి ఇల్లు స్వాగతం పలుకుతూ ఉంటె. . . ఆధ్యాత్మిక వైభవం ద్విగుణం అవుతుందన్నారు. 

మందస గ్రామంలోని ఈ పెరుమాళ్ళ కు పునర్వైభవం తీసుకు వచ్చిన ఘనత గ్రామా ప్రజలది, ముఖ్యంగా యువతి యువకులదేనన్నారు. వాసుదేవ యూత్, ఆండాళ్ గోష్ఠి, శ్రీమన్నారాయణ యూత్ ఇలా ప్రత్యేక బృందాలుగా యువతి

యువకులు ఏర్పడి, తమ ఊళ్లోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసేందుకు నడుంబిగించడం చాలా ఆనందం కల్గించిందన్నారు. 12 ఏళ్ళ క్రితం నుంచి అత్యద్భుతంగా జరుగుతున్నా ఈ వేడుకలకు ఆంధ్ర ప్రదేశ్ నుంచే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారన్నారు. 

ఈ కార్యక్రమం లో చిన్న జీయర్

స్వామి శిష్యులు త్రిదండి దేవనాథ జీయర్ స్వామి, నేపాల్ కృష్ణమాచార్య తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam