DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం లో పర్యాటక అభివృద్ధికి కేంద్రం ఇచ్చింది రూ.52 కోట్లు

*ఆంధ్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వెలుగొందాలి: జివిఎల్*

*సింహాచల వరాహ లక్ష్మి నృసింహుని సేవలో బీజేపీ ఎంపీ* 

*మానవాళి మనుగడకు మార్గదర్శకాలే ఆలయాలు : జివిఎల్* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 6, 2021  (డి ఎన్ ఎస్):* శ్రీ వరాహ లక్ష్మి నృసింహ

స్వామి దేవస్థానం, సింహాచలం క్షేత్రంలో యాత్రీకులకు మౌలిక వసతుల కల్పనకు కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రసాద్ పథకం ద్వారా రూ. 52 కోట్లు కేటాయించిందని భారతీయ జనతా పార్టీ ఎంపీ జివిఎల్ నరసింహారావు తెలిపారు. శనివారం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం, సింహాచలం లో

పర్యటించి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెలుగొందాలి ని స్వామిని ప్రార్ధించినట్టు తెలిపారు. మానవాళి మనుగడకు మార్గదర్శకాలే ఆలయాలు అని, వాటిని భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను పరిరక్షించుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. 

సింహాచలానికి రూ. 52 కోట్లు కేంద్ర

నిధులు:. . . 

హిందూ దేవాలయాల్లో భక్తులకు మౌలిక వసతులు, యాత్రీకులకు, పర్యాటక అభివృద్ధి కోసం బీజేపీ అధికారం లో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులకు కేటాయించేందుకు ప్రసాద్ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. దీనిలో భాగంగానే సింహాచలం క్షేత్రం లో యాత్రీకులకు తగిన సదుపాయాలు కల్పించాలని రూ. 52 కోట్లు

కేటాయించిందన్నారు. ఈ నిధులు ఆలయం అభివృద్ధి కి వినియోగించరాదని, కేవలం యాత్రీకులకు సదుపాయాలు కల్పించడానికే వాడాలన్నారు.   

ఇటీవల కాలం లో ఆంధ్ర ప్రదేశ్ లో దేవీ దేవతలా విగ్రహాలపై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే ఉందన్నారు. సుమారు 140 ఘటనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు నేటికీ

తీసుకోక పోవడం బాధాకరం అన్నారు. అనంతరం సింహాచలం లో భక్తులను అడిగి, ఆలయ నిర్వహణ, వసతులు, సేవల పై వారి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన లో జివిఎల్ వెంట స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులు, జిల్లా నేతలు, రాష్ట్ర మీడియా సమన్వయ కర్త డి ఎస్ వర్మ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam