DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళలకు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ శుభాకాంక్షలు

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 8, 2021  (డి ఎన్ ఎస్):* అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్‌లో పోస్టు చేశారు. దేశంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

మనదేశంలో మహిళలు విభిన్న రంగాల్లో విజయ పరంపర కొనసాగిస్తూ.. రికార్డులు సృష్టిస్తున్నారు. స్త్రీ, పురుష అసమానతల్ని నివారించడానికి మనందరం సమష్టిగా కృషి చేయాలి’ అని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు.

మహిళలకు మోదీ అభినందనలు:. .. 

విభిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న గొప్ప విజయాల పట్ల మనదేశం ఎంతో

గర్విస్తోందని భారత ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీమణులందరికీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీమణులకు వందనం. మహిళలు సాధిస్తున్న విజయాల పట్ల దేశం గర్విస్తోంది. అనేక

రంగాల్లో మహిళా సాధికారత దిశగా పనిచేసే అవకాశం లభించడం మా ప్రభుత్వానికి ఎంతో గౌరవం’ అని మోదీ వెల్లడించారు.

జాతి నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం : గవర్నర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆంద్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్  శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ మహిళలు దేశ

నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను పెంపొందించటంలో ఎల్లప్పుడూ కీలక భూమికను పోషిస్తూ వచ్చారని ప్రశంసించారు. మహిళలు ఎప్పుడూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కరోనాపై పోరులో సైతం ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులతో పాటు మహిళలు సైతం ముందు వరుసలో ఉన్నారని ప్రస్తుతించారు. భారత సామాజిక స్దితిగతుల

మేరకు సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న వారు ఎంతో సహనంతో తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారని,   ఇది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప బహుమతి అని గవర్నర్ కొనియాడారు. జాతి నిర్మాణంలో మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam