DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా విశాఖ భవిత కోసం నడుం బిగించిన అపార్ట్మెంట్ ల వాసులు

*తటస్తుల ఓటింగ్ తో గ్రేటర్ విశాఖ లో ఊపందుకుంటున్న మున్సిపోలింగ్* 

*మధ్యాహ్నం 1 గంటకి 36 శాతం పోలింగ్, పుంజుకుంటున్న ఓటింగ్.* 

*ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు*  

(విశాఖపట్నం రిపోర్ట్: CVS సాయిరాం, బ్యూరో చీఫ్)     

విశాఖపట్నం, మార్చి 10 , 2021 (డి ఎన్ ఎస్ ):

అపామయంగా మారిపోయిన మహా విశాఖనగరం ఇంతకాలం తటస్తంగా ఉండే అపార్ట్మెంట్ వాసులు సైతం ఈ పర్యాయం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుక రావడంతో పోలింగ్ పుంజుకుంటోంది.  మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట సమయానికి 36 శాతం ఓటింగ్ జరిగినట్టు మహా విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, అదనపు ఎన్నికల

అధికారి ఎస్. నాగలక్ష్మి తెలిపారు. బుధవారం ఆంధ్ర ప్రదేశం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా మునిసిపల్ ఎన్నికల్లో విశాఖపట్నం నగర పరిధిలో మొత్తం 98 వార్డుల్లో ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం విశాఖ పట్నం నగర పరిధిలో 1726158 ఓటర్లు ఉన్నారు. ఉదయం 9 గంటల సమయానికి కేవలం 8.89 శాతం ( 153465 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు)

 నమోదు అయ్యింది. తదుపరి రెండుగంటల సమయంలో ఉదయం 11 గంటల సమయానికి ( 383582 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ) 22.22 శాతం ఓటింగ్ జరిగింది. మధ్యాహ్నం  1 గంట సమయానికి ( 622996 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ) 36.09 శాతం ఓటింగ్ జరిగింది. 

ఓటింగ్ లో పాల్గొనేందుకు అపార్ట్మెంట్ ల నుంచి ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్ లకు తరలి వచ్చి

ఓటు వేసి, వెళ్లిపోతుండడంతో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా రద్దీ కానరాలేదు. ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు సైతం విశాఖలోనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతం తో పోలీస్ ఈ పర్యాయం విశాఖ నగర పరిధిలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.  

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు

వి. విజయసాయి రెడ్డి, విశాఖపట్నం లోక్ సభ సభ్యులు ఎం వివి సత్యనారాయణ, విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పి విష్ణు కుమార్ రాజు, సిబిఐ మాజీ డైరక్టర్ వివి లక్ష్మి నారాయణ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, విశాఖ

మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ( కళాభారతి) కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు) తదితరులు విశాఖలోని వార్డుల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam