DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైజాగ్ స్టీల్ ప్రైవేట్ అంశం ఎవరికీ ఓట్లు ఇచ్చింది?

*56 % ఓటర్లు మొత్తం విశాఖ భవిత ను ఎలా తేల్చారు?*

*ఎవరి డబ్బా వారే కొట్టుకుంటున్నారా,  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 10, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో కేవలం 56 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వీళ్ళు వేసిన ఓట్ మొత్తం 45 లక్షల మంది జనాభా ఉన్న మహా విశాఖ భవిష్యత్ ను ఎలా తేల్చారు అనేది మరో నాలుగు రోజుల తర్వాత గానీ తెలీదు. సరిగ్గా ఎన్నికలకు ఒక్కరోజు ముందు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తున్నట్టు ప్రకటించడం పై అన్ని రాజకీయర్ పార్టీలు విస్తృతంగా తమకు

అనుకూలంగా ప్రచారం చేసుకున్నాయి. అయితే ఈ స్థానిక ఎన్నికల్లో వైజాగ్ స్టీల్ అంశం ఓటర్లపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో ఫలితాలు వస్తేగానీ  తెలియదు. ప్రధానంగా గాజువాక ప్రాంతం లో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ నాలుగు రోజుల పాటు దీక్ష చెయ్యడం బాగా కలిసి వచ్చిందని, విశాఖ మేయర్ పీఠం లో కూర్చునేది తమ పార్టీ

అభ్యర్దే నంటూ టీడీపీ వర్గాలు బహిరంగ ప్రకటన చేస్తున్నాయి.

అదే సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ చేస్తున్న ప్రజాసేవకు ప్రజలు ఇప్పడికే దాసోహమైపోయారని, ప్రజా పథకాల పేరిట డబ్బుల పంపిణీ కార్యక్రమం తమకు బాగా కలిసి వచ్చిన అంశమని తెలియచేస్తోంది. ఇప్పడికే 151 మంది ఎమ్మెల్యే లను

గెలుచుకోగలిగామని, అదే విధంగా వైజాగ్ మునిసిపల్ ఎన్నికల్లో వైకాపా క్లీర్న్ స్వీప్ చేస్తుందని, మేయర్  పీఠం పై తమ కార్పొరేటర్ కూర్చుంటారని ఘంటాపధంగా చెప్తోంది. అయితే ఈ ఎన్నికల నిర్వహణను పూర్తి గా రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి కనుసన్నల్లోనే జరిగినట్టు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. 

అయితే కోన ఊపిరి

తో ఉన్న భారతీయ జనతా పార్టీ  కేంద్రం తీసుకున్న స్టీల్ ప్లాంట్ అంశంతో పూర్తిగా కోమాలోకి పోయినదని ఆ పార్టీ వర్గాలే ఆవేదన చెందుతున్నాయి. అయితే జనసేన తో పొత్తు ఉన్నందున కనీసం 10 లోపు సీట్లను ఈ కూటమి గెలుచుకుంటుందని సమాచారం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam