DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్ని హంగులతో మహా విశాఖ కౌన్సిల్ హాల్ సిద్దం

*మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సర్వం సిద్దం*

*జివియంసి ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ వినయ్ చంద్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 17, 2021  (డి ఎన్ ఎస్):* అన్ని హంగులతో కౌన్సిల్ హాలు సిద్దం చేస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్, ఎన్నికల

అధారిటి  వి. వినయ్ చంద్ పేర్కొన్నారు.  గురువారం మహా విశాఖ నగర పాలక సంస్థ కార్యాలయంలోని 2వ అంతస్తులోని కౌన్సిల్ హాలులో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లలో ఏ లోపం ఉండరాదని అధికారులను ఆదేశించారు.  ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.  ఎక్స్ ఆఫీసియో

సభ్యులు, ఎన్నికైన వార్డు సభ్యులు హాజరు అవుతారని చెప్పారు.  ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, సభ్యులంతా ఉదయం గం.10.30 ని.లకే చేరుకోవాలన్నారు.  మేయర్ అభ్యర్థికి గుర్తింపు పొందిన పార్టీ సభ్యులు వివిధ ఫారాలు ద్వారా ప్రతిపాదనలు అందజేయాలని చెప్పారు.  ఈ కార్యక్రమంలో జివియంసి కమీషనర్ నాగలక్ష్మి ,

విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, అదనపు కమీషనర్లు ఆశాజ్యోతి, రమణి, చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, పోలీసు అధికారులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam