DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంబికాపల్లి గ్రామంలో పిఐఎల్ నిత్యావసరాల పంపిణీ

*సిఎస్ఆర్ కార్యాచరణలో భాగమే: పిఐఎల్ బృందం*        

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 17, 2021  (డి ఎన్ ఎస్):* సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా  కాకినాడ కు చెందిన పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ( PIL) జిల్లాలోని అంబికా పల్లి అగ్రహారం

గ్రామములో, సుమారు 210 కుటుంబాలకు నిత్యావసర సామాగ్రిని అందించారు. ఈ సందర్బంగా సంస్థ ఏరియా ఇంఛార్జి  ఎన్ సిహెచ్   రామనరసింహం మాట్లాడుతూ, సమాజం లో తాము కూడా భాగమని, స్థానికులకు తమ వంతు భాద్యత గా పలు సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూయన్నట్టు తెలియచేసారు. కరోనా కష్టకాలం లో సైతం రక్షణా నిబంధనలను పూర్తి గా పాటిస్తూ, గతంలో

సైతం కాకినాడ సమీపం లోని గ్రామాల నివాసులకు నిత్యావసరాలను అందించామన్నారు. 
ఈ కార్యక్రమములో, సంస్థ ప్రతినిధులు  నరేష్, బాజివలి, లలిత్ ప్రధాన్, ధర్మారావు, వాల్మీకి తదితరులు పాల్గొన్నారు.  సంస్థ ప్రతినిధులకు అంబికా పల్లి అగ్రహారం గ్రామ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలిపారు.

పంచాయతీ కార్యదర్శి నారాయణరావు గారు,

విఆర్ఓ సత్యవతి, విఆర్ ఏ సత్తి బాబు, వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి తమవంతు సహకారాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించి, శానిటైజేషన్ చేసుకుని పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam