DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా విశాఖ నగర మేయర్ గా హరి కుమారి ఎన్నిక

*అంతా బహిరంగ రహస్యమే. .. వంశీకి వెన్నుపోటు. .*

*జివిఎంసి సభ లోపల ప్రశాంతత, బయట గందరగోళం*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 18, 2021  (డి ఎన్ ఎస్):* మహా విశాఖ పట్నం నగర మేయర్ గా ఆరిలోవ లోని 11 వ వార్డు చెందిన గోలగాని వెంకట హరి కుమారి ennikayyaru. గురువారం జరిగిన

జివిఎంసి నగర పాలక సమావేశంలో జివిఎంసి ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ వి వినయ్ చాంద్ అధ్యక్షతన  జరిగిన  సమావేశంలో కేవలం ఏకవాక్య ప్రకటనతో మేయర్ ఎన్నికను చదివారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ విస్తుపోయారు. ముఖ్యమంత్రి విశాఖ మేయర్ పదవిని తనకి ఇచ్చేందుకు

 హామీ ఇచ్చారని, అయితే ఈ విషయం ఆయన దగ్గరే తేల్చుకోవాలని ఆ సమయంలో ప్రశాంతంగా ఉండిపోయారు. డిప్యూటీ మేయర్ గా జియ్యని శ్రీధర్ ను ఎన్నిక చేసారు. అనంతరం జివిఎంసి కమిషనర్ ఎస్. నాగలక్ష్మి మేయర్ ను సదర పూర్వకంగా వేదిక పై అధికార సీటులో అసీనులను చేసారు. తదుపరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల సభ్యులు, అధికార పార్టీ నేతలు

మేయర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam