DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ ప్రభుత్వం ఏపీ కి ఇచ్చిన వరం మంగళగిరి ఎయిమ్స్  

*ఈ ఆసుపత్రి సేవల గురించిన ప్రచారమే చెయ్యడం లేదే. . .?*

*అందుబాటులో మంగళగిరి ఏఐఐఎమ్ఎస్ వైద్య సేవలు*  

*విభజన చట్టం లో వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి* 

*ఈ ఆసుపత్రి లో అందుబాటులో ఉన్న సేవలు ఇవే .. .*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి

19, 2021  (డి ఎన్ ఎస్):* భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన అద్భుతమైన వరం మంగళగిరి ఎయిమ్స్. మంగళగిరి లో  ఏర్పాటైన అద్భుతమైన ధన్వంతరి వరప్రసాదం ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎమ్ఎస్) సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన విషయం చాలామందికి తెలియక పోవడం చాలా దురదృష్టం. ఆంధ్ర

ప్రదేశ్ విభజన చట్టం లో భాగంగా 13  జిల్లాల ఏపీ లో ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ఇది. గుంటూరు జిల్లా మంగళగిరిలో అత్యాధునిక వసతులతో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన అద్భుతమైన ఈ ఆసుపత్రి లో వైద్య సేవలను ఏపీ సరిహద్దు జిల్లాల తెలంగాణ ప్రజలు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు.  

మంగళగిరి

ఎయిమ్స్ అందుబాటులో ఉన్న సేవలు ఇవే .. . 

అతి తక్కువ చార్జీలు తో అత్యాధునిక సేవలను అందిస్తున్నారు. ఒపి సేవలు కేవలం పదిరూపాయలు మాత్రమే, ఆ పది రూపాయల రుసుము తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో, కన్ను, ఈ ఎన్ టి, దంత వైద్యం, స్కిన్ లాంటివి చూపించుకోవచ్చు.

న్యూరో విభాగం ఈ ఆసుపత్రిలో ప్రస్తుతానికి ప్రారంభం కాలేదు.

అతి త్వరలో పూర్తిగా ఆపరేట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

అదే విధంగా కాంటీన్ పరిసరాలు కూడా చాలా పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తూ రుచికరమైన ఆహారం అందిస్తున్నారు. కేవలం 75 రూపాయలకే పరిపుష్టమైన ఆహారాన్ని అందిస్తున్నారు. 

సాధారణ మెడికల్ ల్యాబ్ ల్లో కనీసం 5 వేల నుంచీ 10 వేల రూపాయలు అయ్యే

టెస్టులు 
ఎయిమ్స్ లో  కేవలం రూ. 500 నుంచీ 600 రూపాయలు మాత్రమే అయ్యే అవకాశం ఉంటుంది. 

ఈ ఆసుపత్రి గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చెయ్యవలసి ఉంది. అయితే ఇవి ఈ ఆసుపత్రి ni ప్రచారం చెయ్యడం లో పూర్తిగా విఫలం చెందడంతో రాష్ట్రంలో చాలామంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఈ ఆసుపత్రి గురించిన

 సమాచారమే లేదు.   

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మోడీ గురించి ప్రచారం చెయ్యడం కొంచెం ఇబ్బందికరం ఉండడం వాళ్లేమో. .. ఎక్కడా ప్రచారం లేదు. 

అయితే నరేంద్ర మోడీ  అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర కి ఇచ్చిన ఈ వరాన్ని ప్రచారం చేసుకోవడం లో  భారతీయ జనతా పార్టీ కూడా

ఘోరంగా విఫలం చెందింది అనడానికి ఇదే నిదర్శనం. ennikala సమయంలో సైతం ఎక్కడా ప్రచారం చెయ్యకపోవడం గమనార్హం.    

రవాణా సదుపాయం : . . .

ఈ ఆసుపత్రికి చేరుకునేందుకు విజయవాడ నుంచీ హాస్పిటల్ కు బస్సులు ఉన్నాయి. 
 మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలు.

ఆటో లో వెళితే ఐతే 30 నుంచి 50

రూపాయలు తీసుకుంటారు. 

అత్యంత శుభ్రత..డాక్టర్స్ కూడా అంకితభావంతో పనిచేస్తున్నారు..

ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు..

వివిధ టెస్టులు వాటికి అయ్యే చార్జీలు కింద ఇస్తున్నాను..
  

కన్సల్టేషన్ ఫీ: Rs.10

కంప్లీట్ బ్లడ్ కౌంట్  (Hb%, TLC, DLC) -

Rs.135

ఫాస్టింగ్  & రాండమ్  బ్లడ్  షుగర్ - Rs.24+24

లివర్  ఫంక్షన్  టెస్ట్  - Rs.225

కిడ్నీ  ఫంక్షన్  టెస్ట్  - Rs.225

లిపిడ్  ప్రొఫైల్  - Rs.200

థైరాయిడ్  ప్రొఫైల్  - Rs.200

ECG - Rs.50

ఛెస్ట్  X-Ray - Rs.60

Mammography -Rs.630

Ultrasonography - Rs.323

Urine Analysis - Rs.35

HIV

Rapid Test  - Rs.150

HBs Ag Rapid Test - Rs.128

ఇతర సేవల రుసుములు ఆసుపత్రి లో అందుబాటులో ఉన్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam