DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సర్వశాస్త్రాలకూ మూలాధారం భారతీయ వేద వాఙ్మయమే.

*యాగశాలలో అగ్ని కుండ నిర్మాణం జ్యామితి ప్రకారమే* 

*భారతీయ వేద పండితులకు విదేశాల్లో పట్టాభిషేకం. . .* 

*కాత్యాయన, బౌధాయన, మానవ, ఆపస్థంబ శుల్బసుత్రాలలో*

*శుల్బసుత్రాలలో తెలిపిన అంశాలపై అక్కుభొట్లు శర్మ వివరణ*
 
*హోమ ప్రక్రియ - జ్యామితి అంశం పై దీప సౌజన్యకు పీహెచ్ డి*

 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 19, 2021  (డి ఎన్ ఎస్):* ప్రస్తుతం విశ్వ వ్యాప్తంగా అమలులో ఉన్న అంతరిక్ష పరిశోధన నుంచి ఆవకాయ తయారీ వరకూ అన్ని తరహాల రూపకల్పనలో వినియోగించే లెక్కలకు మూలాధారం భారతీయ వేద వాఙ్మయమే నని ప్రముఖ సంస్కృత ప్రసంగీకులు, ఆధ్యాత్మిక

వేత్త, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ విశ్రాంత అధ్యాపకులు డా. అక్కుభొట్లు శర్మ తెలియచేసారు. ఆధునిక కాలం లో అంతరిక్ష పరిశోధనలోను, పురాతన కాలంలో పుష్పక విమానం రూపకల్పనలోనూ వినియోగించిన శాస్త్ర గణాంకాల పరిశీలన అంశాలు ఏనాడో ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వ వేదాల్లో పురుష సూక్తం తెలియచేసిందన్నారు.    
    
అదే విధంగా

ఋషులు నిర్వహించే యజ్ఞ యాగాదులలో ప్రతి అంశంలోనూ గణిత జ్యామితి మిళితమైయుందని, హోమ కుండాలు చక్రం, పక్షి, వర్తుల, త్రికోణం, చతురస్రం,ఇలా పలు ఆకారాల్లో ఉంటాయని, వాటి నిర్మాణం లో వినియోగించే ఇటుకలు ఏ ప్రమాణంలో ఉండాలో కూడా ఒక లెక్క ఉంటుందన్నారు. వీటిని కాత్యాయన, బౌధాయన, మానవ, ఆపస్థంబ శుల్బసుత్రాలలో సంపూర్ణంగా వివరించారని

తెలిపారు. ఒక్కో ఆకారంలో ఉండే హోమకుండా తయారీకి ఏ విధంగా నిర్మాణము ఉండాలో కూడా లెక్క ఉంటుందన్నారు. పూర్వకాలంలో వీటిని వినియోగించినట్టుగా ప్రస్తుత కాలంలో అదే స్థాయిలో అమలులో లేదన్నారు. అయితే వేదపాఠశాలలు నిర్వహించే పీఠాధిపతుల నిర్వహణలో జరిగే క్రతువులు, యజ్ఞ యాగాదులలో పూర్తిగా వేదప్రమాణ ప్రకారమే వీటి నిర్వహణ

ఉంటోందన్నారు.   

స్వదేశీ విద్యావిధానంలో నిర్లక్షమే. .

ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన భారతీయ వేద వాఙ్మయాన్ని విస్త్రతంగా ప్రచారం చేసి, భారతీయ శాస్త్ర వైభవాన్ని నిలబెట్టవలసిన ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యడం బాధాకరం అన్నారు. అయితే ఈ వైభవ విలువ తెలిసిన విదేశీ విద్యావేత్తలు వారి

వారి దేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తూ, విదేశీ విశ్వ విద్యాలయాల్లో ప్రత్యేక కోర్సులను నెలకొల్పి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారన్నారు. దీనికి నిదర్శనమే జర్మనీ, అమెరికా, ఇంగ్లాండ్, తదితర దేశాల్లో ప్రాధమిక పాఠశాల స్థాయిలోనే సంస్కృత విభాగాలు నెలకొల్పి, భారతీయ పండితులను తరలించుకు వెళ్లడమేనన్నారు. 

వేద

పండితులకు విదేశాల్లో పట్టాభిషేకం. ..  

1938 లో రెండవ ప్రపంచ యుద్ధంలో యుద్ధ క్షిపణుల తయారీ లో వినియోగించేందుకు అధర్వణ, యజుర్వేదం లో తెలిపిన అంశాలను డీకోడ్ చెయ్యడానికి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కు చెందిన దండిభట్ల విశ్వనాధ శాస్త్రి ని జర్మనీకి ఆహ్వానించిన ఘనత నాటి పాలకులు హిట్లర్ దే అన్నారు. ఆయన

చేసిన సేవలకు గాను ఆయన చిత్రపటాన్ని జర్మనీ విశ్వ విద్యాలయంలో నెల కొల్పారన్నారు. 
 
కల్ప సూత్రాలు. .వాటి వైశిష్ట్యం : . . .

కల్పసూత్రాలు 4 ఉన్నాయని, వాటిల్లో 1. శ్రౌత సూత్రాలు  2. గృహ్య సూత్రాలు 3. ధర్మసూత్రాలు 4. శుల్బసూత్రాలు.  శుల్బ  మనగా " రజ్జు" అనగా తాడు. ఇవి వేది నిర్మాణ బోధకాలు. ఇవి ముఖ్యంగా

యజుర్వేద అంతర్గతమైనవి. 1. బౌధాయన 2. ఆపస్థంబ 3.వరాహ 4. వాధుల 5. మైత్రాయిణి 6. సత్యాషాఢ 7.మానవ ఇవి కృష్ణ యజుర్వేదం.   
శుక్ల యజుర్వేదం కాత్యాయన శుల్బసూత్రం. ఇవి అన్నీ కొద్ది భేదాలతో  కాత్యాయన, బౌధాయన, మానవ, ఆపస్థంబ శుల్బసుత్రాలలో అంతర్భాగమౌతాయని తెలిపారు.

ఈయన ప్రత్యక్ష సారథ్యంలోనే హోమ ప్రక్రియ - జ్యామితి అంశం పై

పరిశోధన జరిపిన దీప సౌజన్య కు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ పీహెచ్ డి విజయవంతంగా పూర్తి చేసినట్టు పట్టా ను ప్రకటించింది. త్వరలో జరుగనున్న స్నాతకోత్సవంలో ఈమెకు అధికారిక పీహెచ్ డి పట్టాను అందించనున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam