DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23 నుంచి ఉపమాక వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు

*భక్తుల సమక్షంలోనే ఉపమాక వెంకన్న బ్రహ్మోత్సవాలు*

*వైభవంగా వేడుకలు, ప్రధాన అర్చకులు ప్రసాద్ వెల్లడి* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 20, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ జిల్లాలోని నక్కపల్లి మండలం లో గల ప్రసిద్ధి చెందిన ఉపమాక శ్రీవేంకటేశ్వర స్వామి

వారి పుణ్యక్షేత్రం లో ఈనెల 23 నుంచి  ( గురువారం) భక్తులందరి సమక్షంలోనే శ్రీ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు వరప్రసాద్ ఆచార్యులు తెలియచేసారు. పూర్వపు పద్దతిలో యదావిధిగా నిర్వహించుటకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉత్తర్వులు జారీచేసినట్టు పాయకరావుపేట శాసన సభ్యులు

గొల్ల బాబూరావు తెలియచేసినట్టు వివరించారు. దీంతో భక్తులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్వామి వారి వాహనసేవలు యదావిధిగా, కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. వార్షిక కళ్యాణోత్సవముల వివరాలు : . .

మార్చి 23 న (మంగళవారం ) సాయంత్రం

అంకురార్పణ. 

మార్చి 24 న ( బుధవారం )  ఉదయం. ధ్వజారోహణం.

మార్చి 25 న ( గురువారం ) రాత్రి  శ్రీస్వామివారి వార్షిక కళ్యాణోత్సవం.

మార్చి 26 న ( శుక్రవారం ) రాత్రి సదస్యం (పండితసభ)

మార్చి 27 న ( శనివారం ) సాయంత్రం తోటోత్సవం.

మార్చి 28 న ( ఆదివారం ) ఉదయం పూర్ణాహుతి. చక్రవారీ స్నానం ( అవబృదం

)

మార్చి 29 న ( సోమవారం ) రాత్రి  శ్రీ పుష్ప యాగోత్సవం మొదటి రోజు

మార్చి 30 న  ( మంగళవారం ) రాత్రి శ్రీ పుష్ప యాగోత్సవం రెండవ రోజు.

మార్చి 31 న  ( బుధవారం ) రాత్రి శ్రీ పుష్ప యాగోత్సవం మూడవ రోజు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam