DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా ప్రతినిధుల బంధువులు పాల్గొంటే క్రిమినల్ కేసు

*అధికారిక కార్యక్రమాల్లో సభ్యులకు మాత్రమే ప్రవేశం*  

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 22, 2021  (డి ఎన్ ఎస్):* ప్రభుత్వ అధికారిక సమావేశాలలో గానీ, ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొంటే వాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు

చేయనున్నట్టు  పంచాయతీ రాజ్ కమీషనర్ ఆదేశాలు జారీ చేసారు. సోమవారం విడుదలైన ఈ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో కేవలం ప్రజా ప్రతినిధులు మాత్రమే పాల్గొనాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొనడానికి వీలు లేదని,  అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని సమాచారం. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు

ఆదేశాలు జారీ అయ్యాయి. 

గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మరియు జిల్లా పరిషత్  యొక్క అధికారిక సమావేశాలలో ప్రజా ప్రతినిధుల యొక్క  భార్య / భర్తలు, కుటుంబ సభ్యులు, చుట్టాలు పాల్గొంటున్నారని.. అంతేగాక పంచాయతీ రాజ్ వ్యవస్థకు  సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని  పలు ప్రాంతాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు,

రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యాలయం & కమీషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.

దీనికి స్పందించిన పంచాయతీ రాజ్ కమీషనర్ జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది

ప్రజా ప్రతినిధుల (వార్డ్ సభ్యులు, సర్పంచ్, MPTC, ZPTC, MPP, ZPP) కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో & కార్యక్రమాలలో పాల్గొనడానికి వీలు

లేదు.

పాల్గొంటున్నారని తెలిస్తే సంబంధిత పంచాయతీ సెక్రటరీ, MPO, MPDO, DPO, ZP CEO లపై కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్  ప్రకారం చర్యలు ఉంటాయని పంచాయతీ రాజ్ చట్టం 2018 - సెక్షన్ 37(5) ప్రకారం (women) ప్రజా ప్రతినిధుల భర్త / కుటుంబ సభ్యులు / చుట్టాలపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి.

ఇలాంటి సమస్యలు ప్రజలు చూస్తే పంచాయతీ రాజ్ కమీషనర్

లేదా కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగలరని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam