DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కు అంబులెన్సు బహూకరణ

విశాఖపట్నం,  మార్చి 22, 2021 (డి ఎన్ ఎస్ ) : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శతవార్షిక ఉత్సవాలను పురస్కరించుకుని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు 29 లక్షల రూపాయలు విలువచేసే ఒక అంబులెన్సు వాహనాన్ని, ఒక డీప్ ఫ్రీజర్ ను, బ్లడ్ బాగ్ ట్యూబ్ సీలర్ ను  అందించారు. సోమవారం నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం వద్ద

జరిగిన ఈ కార్యక్రమంలో వీటిని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్  ఛీఫ్ రీజనల్ మేనేజర్ వి సుధాకర్ ఈ అంబులెన్సు తాళాలను రెడ్ క్రాస్ విశాఖపట్నం జిల్లా  గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి వేణుగోపాల్ కు అందించారు. ఈ డీప్ ఫ్రీజర్ లో మైనస్ 80 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు రక్త నిల్వలు పాడవకుండా ఉండే అవకాశం ఉందనీ ఇండియన్ రెడ్ క్రాస్

సొసైటీ విశాఖ జిల్లా  గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ తెలియజేశారు తమ సంస్థ ద్వారా విశాఖ జిల్లా పరిధిలోని ఎన్నో ఆసుపత్రులకు రక్త నిల్వలను ప్రతిరోజు అందిస్తున్నట్లు తెలిపారు ఎందరో ప్రాణాపాయ స్థితిలో రక్తం నిల్వల కోసం తమ సంస్థ వద్దకు చేరుకుంటారని వారికి అవసరాలకు తగినట్టు రక్త నిల్వలను ఆయా రక్త గ్రూపులకు సంబంధించి

అంది అందిస్తున్నట్లు తెలిపారు అయితే దూరప్రాంతాలకు వెళ్లే వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుందన్నారు వీటి అవసరాలకు అనుగుణంగా తమ సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రాంతీయ మేనేజర్ కే గణేష్ భూపాల్ రావు, విశాఖ రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి  కె . శ్రీనివాసరావు,

కమిటీ సభ్యులు కే విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam