DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇక పై  వైద్య, ఇంజనీరింగ్ విద్యలు కూడా స్ధానిక భాషల్లోనూ

*ప్రయోగాత్మకంగా రాష్ట్రానికో రెండు కాలెజ్ లు ఎంపిక*

ఎంపీ మార్గాని ప్రశ్నకు కేంద్ర మంత్రి పోక్రియాల్ 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 23, 2021 (డిఎన్ఎస్):* ఇక పై స్ధానిక భాషల్లోనూ వైద్య, ఇంజనీరింగ్ విద్యలు కూడా అమలు చేసే అవకాశం ఉందని కేంద్ర విద్యా శాఖా

మంత్రి రమేష్ పోక్రియాల్ సమాధానం ఇచ్చారు. ప్రాంతీయ భాషల్లో సాంకెతిక వైద్య విద్యను క్షేత్రస్ధాయికి తీసుకెళ్లే ప్రతిపాదనేమైనా ఉందా...ఇది నిజమే అయితే సాధ్య పడేదేనా..? ఇందుకోసం రాష్ట్రానికో రెండు కళాశాలల చొప్పున ఎంపిక చేయనున్నారా అనే రాజమహేంద్రవరం ఎంపీ పార్లమెంటు లో వైసీపీ విభాగం చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ వేసిన

ప్రశ్నకు ఆయన ఔను నిజమే అంటూ సమాధానం ఇచ్చారు.

లోక్ సభలో ఎంపీ భరత్  లేవనెత్తిన అంశంలో మంత్రి మాట్లాడుతూ15 వ ఆర్థిక కమిషన్ సిఫారసు చేసిందన్నారు. ప్రయోగాత్భకమైన ఈ కొత్త ప్రక్రియ వల్ల గ్రామీణ పట్టణ తారతమ్యం అంతరిస్తుందని స్ధానిక భాషలో గ్రామీణ విద్యార్ధి లోకానికి సాంకేతిక మెళుకువలు ఒంటబట్టడం ఉన్నత విద్యలో

అత్యవసరం అన్నారు. ప్రతిభకు ఇది మరింత ఉపకరిస్తుందన్నారు...ముఖ్యంగా ద్విభాషా విధానం అవలంబిస్తే ఉపాధి కల్పన సునాయాసంతో పాటు స్ధూల నమోదు నిష్పత్తి అధికమౌతుందన్నారు.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam