DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు ఘన స్వాగతం

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 24, 2021  (డి ఎన్ ఎస్):* తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి విమానంలో చంద్రబాబు బుధవారం గన్నవరం చేరుకున్నారు. ఆయనకు

టీడీపీ గన్నవరం నియోజకవర్గం ఇన్‌చార్జి, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నియోజకవర్గ నాయకులు, తెలుగు యువత నాయకులను ఆయన చంద్రబాబుకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై యువత పోరాటం చేయాలని సూచించారు. అనంతరం ఆయన రోడ్డు

మార్గంలో మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయానికి వెళ్లారు. 

చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా, సీనియర్ నాయకుడు మారుపూడి ధన కోటేశ్వరారవు, తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు మూల్పూరి సాయి కల్యాణి, టీడీపీ ఉంగుటూరు మండల అధ్యక్షుడు డాక్టర్ ఆరుమళ్ల కృష్ణారెడ్డి, విజయవాడ

రూరల్ మండల ప్రధాన కార్యదర్శి కోనేరు సందీప్, గన్నవరం మండల ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి, తెలుగు మహిళ గన్నవరం నియోజకవర్గం అధ్యక్షురాలు మేడేపల్లి రమా, తెలుగు యువత జిల్లా నాయకుడు మండవ అన్వేష్, గన్నవరం మండల ఉపాధ్యక్షుడు బడుగు కార్తీక్, నాయ‌కులు నున్న బాలు, అరవపల్లి వేణు, బొడపాటి వెంకట్రావు, గుడ్డేటి శ్యామ్, కొమ్మినేని

బాబీ తదితరులు ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam