DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రిలో క్రీడా వసతులకై రూ. రూ.20.80 కోట్లు నిధులు

*నన్నయలో క్రీడల కోసం కేంద్ర ఖేలో ఇండియా" పథకం*  

*సాయి ఉత్తర్వులు విడుదల: రాజమండ్రి ఎంపీ భరత్*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 24, 2021  (డి ఎన్ ఎస్):* రాజమహేంద్రవరం సమీప ప్రాతాల యువతకు క్రీడల్లోకెల్ల మేటి అయిన స్విమ్మింగ్ పూల్ తో పాటు పలు క్రీడలకు అవసరమైన

సదుపాయాలు సమ కూరనున్నాయి. ఇందుకోసం రూ.20 కోట్లు పైబడి నిధులతో ఈ హంగులు సమకూరనున్నాయని రాజమహేంద్రవరం ఎంపీ, వైయస్సార్సీపి పార్లమెంటరీ చీఫ్విప్ మార్గాన్ని భరత్ రామ్ చెప్పారు.

ఇందుకోసం నిపుణుల కమిటీ నన్నయ్య యూనివర్సిటీ ని సందర్శించేందుకు నగరానికి గురువారం రానుందని రాజమహేంద్రి ఎంపీ లోక్ సభ వైసీపీ

పార్లమెంటరీ విభాగం చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ ఢిల్లీ నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆవరణలో "కేంద్ర ఖేలో ఇండియా" పథకంలో భాగంగా క్రీడా ప్రాంగణాల మౌలిక సదుపాయాల నిర్మాణాలకు నిధులు మంజూరు ప్రతిపాదనలతో పాటు వాటి సాధ్యసాధ్యాలపై నివేదిక కోరుతూ

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియ {సాయ్} డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు.

తాను ఈ మేరకు స్పోర్ట్స్ సెక్రటరీ రవిమిట్టల్ ను కలిసి క్రీడా విభాగానికి చెందిన అభ్యర్ధనలను గుర్తుచేయగా అప్పటికే విడుదలైన ఉత్తర్వుల కాపీ తనకు అందించారన్నారు.

ఈ సందర్భంగా నేలచదునుతో సహా  400 మీటర్ల సింథటిక్

అథ్లెటిక్ ట్రాక్ ను రూ.7 కోట్ల తోనూ... మల్టీపర్పస్ హాల్ {60×40మీటర్లు} నిర్మాణానికి రూ.10 కోట్లు...స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ {50×21 మీటర్లు} నిర్మాణానికి రూ.3.80 కోట్లుతో  ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని రవి కుమార్ చెప్పారన్నారు.

పై నిర్మాణాల సాధ్యా సాధ్యాలపై సాంకేతిక నివేదికను ముగ్గురు నిపుణుల కమిటీ క్షేత్ర

పరిశీలన చేసి సిఫార్సు చేయాల్సి ఉందన్నారు.

ఇందుకోసం ఈ నెల 26 వ తేదీ లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా బెంగళూరు కు చెందిన సహాయ స్విమ్మింగ్ అకడమిక్ కోచ్ మాథ్యూస్ అబ్రహాం, విశాఖపట్నంకు చెందిన సీనియర్ వాలీబాల్ కోచ్ ఇన్చార్జి కె.సి త్రిపాఠి, ఏలూరుకు చెందిన సీనియర్ అథ్లెటిక్ కోచ్ ఇన్చార్జి డి.ఎన్.వి వినాయక ప్రసాద్ లను

నియమించినట్టు సాయ్ తన  ఉత్తర్వులలో పేర్కొందని ఎంపీ మార్గాని భరత్ రామ్ ఢిల్లీ నుంచి తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam