DNS Media | Latest News, Breaking News And Update In Telugu

45 ఏళ్ళు దాటినా వారంతా కోవిడ్ టీకా తీసుకోవాలి: బీజేపీ 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 25, 2021 (డిఎన్ఎస్):* 45 సంవత్సరాలు వయసు దాటి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని  భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర కార్యవర్గ  సభ్యులు   మరియు అనకాపల్లి బిజెపి పార్టీ పార్లమెంటరీ  నియోజకవర్గ

ఇంచార్జ్ ఎస్ వి ఎస్ ప్రకాష్ రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం ఆయన స్థానిక హెల్త్ కేంద్రం లో ఈ టీకాను తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 45  సంవత్సరాలు వయసు దాటి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ టీకా తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక  శక్తి అభివృద్ధి చెందుతుందని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులు

బాటు ప్రకారం ఏప్రిల్ 1 నుండి 45 సంవత్సరాలు దాటిన ప్రతి వారికి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. 
భారతావనిలో మరోసారి కరోనా విజృంభిస్తున్నదని ప్రజలందరూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నారు.

బీజేపీ ఆంధ్రప్రదేశ్ వైద్య విభాగం కన్వీనర్

రూపాకుల రవికుమార్ మాట్లాడుతూ భారత్ లో తయారు అయిన ఈ వ్యాక్సిన్ 70 దేశాలకు పైగా మనము అందజేస్తున్నామని భారతావనిలో తయారైన ఈ వ్యాక్సిన్ కు ప్రపంచమంతట గుర్తింపు వచ్చినదని, భారత శాస్త్రవేత్తల ప్రతిభను ప్రపంచ ప్రజలు గుర్తించారన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోజు రోజుకీ పెరుగుతునదని, ప్రభుత్వము కరోనా

వ్యాక్సిన్ను వేయించు కొనుట వలన కలిగే లాభాలను ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ వ్యాక్సిన్ యొక్క ఆవశ్యకతను తెలియజేసే విధముగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ,ఇంటింటికీ వాలంటీర్స్ సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 

పాఠశాలలలో, కళాశాలలలో చదువుకునే విద్యార్థులకు ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా

ప్రభుత్వము కఠిన నియమ నిబంధనలు విధించాలని, అత్యవసరమైతే విద్యా సంస్థలకు కొన్ని రోజులు సెలవులు ప్రకటించాలని కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam