DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ ధర్మ పోరాటాలకు పుట్టినిల్లు విశాఖ శారదా పీఠం : స్వరూపానందేంద్ర

*పీఠం పై అవాకులు వ్యాఖ్యానించే వారికీ ధర్మ ప్రచారంతోనే సమాధానం*

*ధర్మ జాగృతి కోసం స్వామిజనులతో శారదాపీఠం తిరుమల యాత్ర* 

*ధర్మ ప్రచార యాత్ర ద్వారా దేవాలయ వ్యవస్థలో లోపాలను గుర్తించాం* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 29, 2021, 2020

(డిఎన్ఎస్):* హిందూ ధార్మిక,  ధర్మపోరాటాల కు పుట్టినిల్లు విశాఖ శ్రీ శారదాపీఠం అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి తెలియచేసారు. విశాఖ శ్రీ శారదాపీఠం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర తెలుగు రాష్ట్రాల్లో ముగియనున్న సందర్భంగా 25 బస్సుల్లో వందలాది మంది దళిత, గిరిజనులతో కలిసి

తిరుమల యాత్ర చేయనున్న భారీ యాత్ర కు 29వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠం వద్ద పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెలది మందితో తిరుమల యాత్ర భారత దేశ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టం అన్నారు. ఇలాంటి యాత్ర గతంలో ఇతరులు చేసిన

దాఖలాలు తక్కువేనన్నారు. 
ఉత్తర పీఠాధిపతులు  స్వాత్మానందేంద్ర చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర తెలుగు రాష్ర్టాల్లో దిగ్విజయంగా పూర్తయిందని, తదుపరి ఆసేతు హిమాచలం పర్యటిస్తారని స్వరూపానందేంద్ర తెలియచేసారు. 
విశాఖ శారదాపీఠంపై అవాకులు చవాకులకు ధర్మ ప్రచారంతోనే సమాధానం చెబుతున్నామని, స్వరూపానందేంద్ర

ప్రకటించారు. తెలుగు రాష్ర్టాల్లో ధర్మపోరాటాల ద్వారా విశాఖ శారదాపీఠం ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ఎన్నో దేవాలయాల్లో నిర్వహణ విధానాల్లోని తప్పిదాలకు తగు సూచనలు సూచనలు చేశామన్నారు. వీరి ధర్మ ప్రచార యాత్ర ద్వారా దేవాలయ వ్యవస్థలో లోపాలను గుర్తించామని, దేవాదాయ శాఖ ప్రక్షాళన కోసం ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక

అందిస్తామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam