DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నామినేషన్ వెయ్యడానికి తిరుమల శ్రీవారి అనుమతి కోసం

*స్వామి దర్శనం తర్వాతే రత్నప్రభ నామినేషన్ దాఖలు* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*తిరుపతి / విశాఖపట్నం, మార్చి 30, 2021 (డిఎన్ఎస్):* కోట్లాది మంది హిందువుల సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యక్రమాన్ని మొదలు పెట్టినా తిరుమల శ్రీనివాసుని ఆశీస్సులు పొందడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని

కొనసాగిస్తూ భారతీయ జనతా పార్టీ తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న విశ్రాంత ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ సోమవారం తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకుని, నెల్లూరు బయలు దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతి ప్రాంతంలో ఏ కార్యాచరణ చెయ్యాలన్నా శ్రీనివాసుని అనుమతి తప్పని సరి అన్నారు. పైగా

ఈ ఆలయ పరిధి మొత్తం తిరుపతి లోక్ సభ పరిధిలోకే వస్తుందని, చట్టసభ లో ఈ ప్రాంతం తరపున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి కి కచ్చితంగా శ్రీనివాసుని ఆశీస్సులు ఉండాలన్నారు. ఒక అధికారిగా విధులు నిర్వహించడం ఒక భాద్యత అని, ప్రజా ప్రతినిధిగా విధులు నిర్వహించడం ఒక కర్తవ్యమ్ అన్నారు. 
అనంతరం నెల్లూరు బయలు దేరి వెళ్లి, ఉప ఎన్నిక లో

బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam