DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాస్క్ ధరించడం తప్పనిసరి : ఎస్పీ అమిత్ బర్దర్

*శ్రీకాకుళం నగర ప్రజలకు మాస్క్ వినియోగం పై అవగాహన*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*  

*శ్రీకాకుళం, మార్చి 30, 2021  (డి ఎన్ ఎస్):* జిల్లాలో ప్రజలు అందరూ విధిగా మాస్క్ ధరించడం పై జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా  ఈ రోజు  జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్

జిల్లా కేంద్రంలోని సూర్యమహాల్ జంక్షన్, ఎస్.బి.ఐ జుంక్షన్, నవభారత్ జంక్షన్ మరియు అంబేద్కర్ జంక్షన్ వద్ద మాస్క్ పై స్పెషల్ డ్రైవ్  అవగాహన చేపట్టారు. ఈ క్రమంలో ముందుగా సూర్యమహాల్ జుంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేసి వాహనాలు ప్రయాణిస్తున్న ప్రయాణీకులుకు, రోడ్డుపై నడిచి వెళ్తున్న ప్రజలకు మాస్క్ ధరించిన వారిని గుర్తించి

వారందరికీ మాస్క్ ధరించడం పై ప్రత్యేక అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు ధరించాలని సూచించారు. సూర్యమహాల్ జంక్షన్ నుంచి ఎస్.బి. ఐ జంక్షన్ వరకు ఎస్పీ గారు  నడుచుకుంటూ వెళుతూ మార్గమధ్యంలో ఉన్న దుకాణాలను పరిశీలించి పని చేసే వర్కర్స్, యాజమాన్యానికి నో మాస్క్ నో ఎంట్రీ హెచ్చరిక బోర్డ్ ప్రతిఒక్కరు దుకాణాలు ముందు పెట్టాలని

సూచించారు.అనంతరం అంబెడ్కర్ జుంక్షన్ వద్ద రవాణా బసు లను ఆపించి ఎస్పీ గారు స్వయంగా పరిశీలించి ప్రయాణం చేస్తున్నా ప్రయాణీకులకు విద్యార్థులకు మరియు యువతీ యువకులకు మాస్ ప్రతి ఒక్కరు ధరించాలని సూచిస్తూ మాస్క్ ధరించిన వారిపై జరిమానా విధించడం జరుగుతుందని తెలియజేశారు. 
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ

మాస్క్ ధరించడం పై జిల్లాలో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడవ రోజుగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లు పరిధిలోని రెవెన్యూ, మునిసిపాలిటీ సిబ్బంది సంయుక్తంగా ఈ అవగాహన కార్యక్రమం  కొనసాగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. మాస్కు ధరించేటప్పుడు ముక్కు, నోరు కప్పే విదంగా మాస్క్

ధరించాలి అని సూచించారు. కొంతమంది  బయటకు వచ్చిన సమయంలో మాస్కు జోబి లో పెట్టుకుని బయట ప్రాంతంలో తిరుగుతున్నారని మాస్క్ అనేదే జోబోలో కాకుండా  ముక్కు ,నోరు కవర్ అయ్యే విధంగా పెట్టుకోవాలి అని తెలిపారు. పట్టణంలో ప్రతి షాప్ నందు నో మాస్క్ నో ఎంట్రీ  హెచ్చరిక బోర్డు లను తప్పకుండా పెట్టాలని షాప్ యాజమాన్యం నకు ఇప్పటికే

తెలియజేయడం జరిగింది అని అన్నారు. జన సమూహం ఉన్న మార్కెట్ ప్రదేశాలు మరియు బహిరంగ ప్రదేశాలలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు విధిగా ధరిస్తే కరోనా వైరస్ వ్యాప్తి  నియంత్రించవచ్చని తెలిపారు
25 నుంచి 35 వయస్సులో ఉన్న వారు  ఎక్కువ మంది మాస్కు ధరించకుండా బయట ప్రాంతంలో తిరగడం గమనించడం జరిగింది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ

సామాజిక బాధ్యతగా కోవిడ్ నియంత్రణలో మాస్క్ ధరించి పోలీసు శాఖకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నందున ప్రజలందరూ కోవిడ్ నియమ నిబంధనలతో పాటు స్వియా నియమాలను పాటిస్తే తప్పకుండా జిల్లాలో అనతి కాలంలోనే కోవిడ్ నియంత్రించవచ్చని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.కరోనా వైరస్ నియంత్రణలో

ప్రజల్లో విస్తృత అవగాహన కల్పనలో మీడియా మిత్రులు క్రియాశీలకంగా వ్యవహరించటలో తమ వంతు కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు సహాయ సహకరాలు అందించాలని ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ లు ఎం. మహేంద్ర, బాలరాజు, సిఐ పివి రమణ, ఆర్.ఐ ప్రదీప్, ఎస్సైలు పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam