DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమహేంద్రి కి హెరిటేజ్ సిటీ హోదాకై లేఖ: ఎంపీ భరత్ 

*యునెస్కో కు హేవలాక్ వంతెన ప్రతిపాదనతో కేంద్రానికి డీపీఆర్*

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 31, 2021  (డిఎన్ఎస్):* రాజమహేంద్రవరం నగరాన్ని హెరిటేజ్ సిటీ గా  హోదా సాధించేందుకు అవసరమైన అర్హతలన్నీ ఉన్నాయని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ

ప్రతిపాదనలు పంపించింది. ఆ జాబితాలో చేర్చి అంతర్జాతీయ ఖ్యాతికి బాటలు వేయాలని కోరుతూ ప్రధానంగా హేవలాక్ బ్రిడ్జిని యునెస్కో సారథ్యంలో అంతర్జాతీయ పర్యాటక స్ధాయిలో స్వీకరించి నిధులు అందించాలని ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ డిపిఆర్ తో సహా ప్రతిపాదనలు పంపించినట్టు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్ తెలిపారు. నగరానికి

సంబంధించిన అంశాలపై రాష్ట్ర పర్యాటక, దేవాదాయ శాఖల సంయుక్త సమీక్షలో రాజమహేంద్రి ప్రాశస్థ్యంపై సుదీర్ఘ సమీక్ష జరిగింది.
పర్యాటక  శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ ల సారధ్యంలో పర్యాటక శాఖ అడిషనల్ సెక్రటరీ
రజత్ భార్గవ్, దేవాదాయ, సాంస్కృతిక శాఖల

ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ నగరానికి ఉన్న పురాతన ప్రాశస్త్యం పై నివేదికలపై తుది సమీక్షలు చేసి రూపొందించిన డిపిఆర్ లను కేంద్రానికి పంపించారు. 

ఇప్పటికే క్షేత్ర స్థాయి సందర్శన నేపథ్యంలో సంబంధిత ఐఏఎస్ లు డిపిఆర్ లు తయారు చేసి కేంద్రానికి సమర్పించారు. చారిత్రక ప్రాధాన్యత కల్గిన నగరంగా అన్ని అర్హతలూ

రాజమహేంద్రికి ఉన్న దరిమిలా నేపథ్యంలో ప్రత్యేక డీపీఆర్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపాలని సమీక్షలో తుది కసరత్తు పూర్తి చేసారు. 
బ్రిటిష్ కాలంలో 150 ఏళ్లనాడు నిర్మించిన హేవలాక్ బ్రిడ్జి  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వేశాఖ బదలాయించినందున పర్యాటకంలో దానిని కూడా చేర్చి మరో డీపీఆర్

ను తయారు చేసి పంపించారు. ఎట్టకేలకు రెండు డి పి ఆర్ లు కేంద్రానికి పంపించడం జరిగింది.

ఆమోదం లభించగానే రాజమహేంద్రి నగరానికి ఇప్పుడున్న అందాలకు తోడు కొత్త శోభ జత కలిసి పరోక్షంగా వేలమంది యువతకు ఉపాధిని అందించే వనరు కాగలదని ఎంపీ భరత్ రామ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam