DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి కళ్యాణమస్తు దరఖాస్తుల ఆహ్వానం:హెచ్ డిపిపి 

*ఏప్రిల్ 28 లోగా విశాఖ టిటిడి కార్యాలయానికి చేరాలి* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 31, 2021 (డిఎన్ఎస్):* తిరుమల తిరుపతి  దేవస్థానములు,  హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మే 28 న నిర్వహించనున్న కల్యాణమస్తు ఉచిత సామూహిక వివాహ కార్యక్రమం లో పాల్గొనదలచిన

భక్తులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా  విశాఖపట్నం జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ తెలియచేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాలలోను ఈ కార్యక్రమం జరుగుతోందని, దానిలో భాగంగా విశాఖపట్నం జిల్లా లోని 15 నియోజకవర్గాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

పాల్గొనే భక్తులకు కార్యక్రమానికి సంబందించిన  విధి విధానాలు మరియు దరఖాస్తు పత్రములు  తితిదే వెబ్ సైట్ ద్వారా గానీ, విశాఖ పట్నం నగరం లోని టీటీడీ కల్యాణమండపం లోని హిందూ ధర్మ ప్రచారపరిషత్  ప్రోగ్రాం అసిస్టెంట్  నుండి కానీ పొందవచ్చని తెలిపారు. 

పూర్తిచేసిన  దరఖాస్తు  పత్రములను ఏప్రిల్ 20 లోగా

విశాఖపట్నం లోని టీటీడీ, కల్యాణమండపం లోని కార్యాలయము కు పంపవలసిందిగా కోరుతున్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచారపరిషత్ ద్వారా మీకు 2 గ్రాముల మంగళసూత్రములు, మెట్టెలు మరియు వధూవరులకు నూతన వస్త్రములు అందించబడును. ఈ సదవకాశాన్ని సనాతన హైందవ ధర్మానికి చెందిన అవివాహితులు ఐన  యువతీ

యువకులు సద్వినియోగం పర్చుకోవాల్సిందిగా  కోరుతున్నారు.  ఈ కార్యక్రమం పూర్తిగా కోవిడ్  నిబంధనలకు లోబడి, కలెక్టర్ గారి ఆదేశాల అనుసరించి  మాత్రమే నిర్వహించడం జరుగుతుందన్నారు.  పూర్తి వివరాలకు జిల్లా ప్రోగ్రాం అసిస్టెంట్  ని ఫోన్ నెంబర్ 9491607365,  9494524782,  9703147716, మరియు 9491804061 ల్లో సంప్రదించగలరు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam