DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దమ్ముంటే తనపై ప్రతాపం చూపాలని, జనసేనాని సవాల్

*తిరుపతిలో జనాకర్షణగా జనసేనాని తొలి పలుకులు*

*తిరుపతి వీధుల్లో జనసేనాని పవన్ కు జన నీరాజనం* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*తిరుపతి / విశాఖపట్నం, ఏప్రిల్ 3, 2021 (డిఎన్ఎస్):* తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్ధి  కె.రత్నప్రభ విజయాన్ని కాంక్షిస్తూ

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తిరుపతిలో చేపట్టిన యాత్రలో చేసిన తొలిపలుకులు అందరినీ ఆకర్షించాయి. తిరుపతి ఎంపీ గా ఉన్న దుర్గాప్రసాద్ అర్ధాంతరంగా కాలం చెయ్యడం బాధాకరమని, వారి కుటుంబాన్ని జనసేన మొత్తం కుటుంబాల తరపున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నామంటూ పనవ్ కళ్యాణ్ చేసిన తొలి పలుకులు అందరిని కదిలించాయి. ఆ ఎంపీ

ప్రత్యర్థి పార్టీకి చెందినా సానుభూతి తెలపడం మన ధర్మం అంటూ మొదలు పెట్టిన ప్రసంగం లో అధికార పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కనీసం ఆ ఎంపీ కుటుంబాన్ని కలిసేందుకు కూడా ఇష్టపడక పోవడం వారి కె చెల్లిందన్నారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్నా ప్రతి అంశాన్ని ఎట్టి చూపించారు. 

151 సీట్లు తెచ్చుకున్న YCP పాలన ఎలా ఉందంటే..

ఆరు నెలలు కర్రసాము చేసి మూలన ఉన్న ముసలమ్మని కొట్టినట్టుందన్నారు. సామాన్యలపైన, జనసేన కార్యకర్తల పై కాదు మీ ప్రతాపం. దమ్ముంటే తనపై చూపండని, . ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  కి  ఛాలెంజ్ చేసారు. 

పాదయాత్రకు అపూర్వ స్పందన: . . .

తిరుపతిలో జరిగినా పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

జైత్రయాత్ర పేరిట శనివారం సాగిన పాదయాత్రతో తిరుపతి పురవీధులు జనసంద్రంగా మారాయి. యాత్ర ప్రారంభమయిన ఎం.ఆర్. పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి వరకు ప్రధాన రహదారి మొత్తం మధ్యాహ్నం నుంచి జనసేన - బీజేపీ శ్రేణులతో నిండిపోయింది. ఎం.ఆర్. పల్లి సర్కిల్ ప్రాంతంలో ఎటు చూసినా జనసేన, బీజేపీ జెండాలే. మేళతాళాలతో ఆ ప్రాంతం ఉత్సవ శోభను

సంతరించుకొంది. పవన్ కళ్యాణ్ గారి కటౌట్లతో ఆ ప్రాంతం మొత్తం నిండిపోయింది. జయజయధ్వానాలు చేస్తూ పవన్ కళ్యాణ్  చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేసి, హారతులు పట్టారు. ఎం.ఆర్.పల్లి సర్కిల్ ప్రాంతంలోని భవనాలు సైతం పూర్తిగా జనంతో నిండిపోయాయి. 

ఒక దశలో దారి పొడుగునా వందల సంఖ్యలో వచ్చి కలుస్తున్న కార్యకర్తలు,

ప్రజలతో రహదారులు పూర్తిగా దిగ్భంధనం కావడంతో తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్  తిరిగి వాహన శ్రేణిపైకి ఎక్కాల్సి  వచ్చింది. పాదయాత్ర ఆద్యంతం జనసైనికులకు అభివాదం చేస్తూ, గజమాలలతో దగ్గరకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. శంకరంబాడి సర్కిల్ వద్ద సభా ప్రాంగణం వద్ద ఆయనకు బీజేపీ రాష్ట్ర, జాతీయ

నాయకులు స్వాగతం పలికారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam