DNS Media | Latest News, Breaking News And Update In Telugu

10 ఏళ్ళల్లో 30 వేల సర్జరీలు జిఎంఆర్ ఆసుపత్రి ఘనత

*వరలక్ష్మి కేర్ ఒపిలో 7 లక్షలకు పైగా రోగులకు సేవలు*  

*25 వేలకు పైగా కుటుంబాలకు జిఎంఆర్ ఆరోగ్య కార్డులు*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*శ్రీకాకుళం / విశాఖపట్నం, ఏప్రిల్ 5, 2021 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా రాజాం లోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్ చేస్తున్న వైద్య

ఆరోగ్య సేవలను అనిర్వచనీయం. కేవలం ఒక దశాబ్ద కాలం లోనే 30 వేల విజయవంతమైన సర్జరీలు పూర్తి చేసిన ఘనత  జిఎంఆర్ కేర్ దే. 
  
జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగమైన జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌కు చెందిన జీఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్ ఇటీవల 10వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ మల్టీ-స్పెషాలిటీ

ఆసుపత్రి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలకు తక్కువ ఖర్చుతో సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, రాజాంలో 25 ఎకరాల ప్రాంగణంలో విస్తరించిన ఈ 200 పడకల ఆసుపత్రిని  2011 ఏప్రిల్ 2న నాటి భారత రాష్ట్రపతి, ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. 

జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ,

ఆర్థోపెడిక్స్, ప్రసూతి మరియు గైనకాలజీ, నియోనాటాలజీ & పీడియాట్రిక్స్, అనస్థీషియాలజీ, డెంటల్, ఈఎన్‌టీ, క్రిటికల్ కేర్, నెఫ్రాలజీ మరియు ఆప్తాల్మాలజీలో సేవలను అందిస్తోంది.

సమాజానికి సేవలను అందించడంలో దశాబ్దం గడిచిన సందర్భంగా ఈ ఆసుపత్రి 25 వేల కుటుంబాలకు ఉచితంగా పేషెంట్ కన్సెషన్ కార్డ్ (పిసిసి)లను

అందిస్తోంది. దీనిని ఉపయోగించుకుని, లబ్ధిదారుడి కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ఉచిత OPD సేవలు, పరీక్షలపై రాయితీ మరియు శస్త్రచికిత్స ఛార్జీలకు రాయితీ పొందవచ్చు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam