DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమిత్ షా, యోగి లపై దాడి కి సై అంటూ ఈమెయిల్ కలకలం 

*ముంబై సీఆర్పీఎఫ్ సంస్థకు వచ్చిన ఈమెయిల్ పై వైరల్*

*11 మంది ఆత్మాహుతి బాంబర్లు రంగం లోకి . . అన్నది సారాంశం.

*ఈ సమాచారం లో నిజమెంత? అనే దానిపై తనిఖీలు.*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 6, 2021 (డిఎన్ఎస్):* మంగళవారం మహారాష్ట్ర లోని ముంబై లోని

కేంద్ర రిజర్వేడ్ రక్షణ బలగాల ప్రధాన కేంద్రానికి వచ్చిన ఒక ఈమెయిల్ పై మీడియా వర్గాల్లో వైరల్ అవుతోంది. కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ దాస్ లపై దాడులు జరిపేందుకు 11 మంది ఆత్మాహుతి బాంబర్లు రంగం లోకి దిగారు అన్నది ఆ ఈమెయిల్ సారాంశం. సీఆర్పీఎఫ్ సంస్థకు వచ్చిన ఈమెయిల్

ప్రస్తుతం సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రినిక్ మీడియాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ మెయిల్ కొన్ని రోజుల క్రితం వచ్చినట్టుగా తెలుస్తోంది. 

ఈ సమాచారం లో నిజానిజాలు తేల్చేందుకు కేంద్ర రక్షణ బలగాలు రంగం లోకి దిగాయి. మెయిల్ ను ముందుగా ఆకతాయిల పనిగా అనుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఉన్నతాధికారుల దృష్టిలోకి

వెళ్లడంతో ఈ ఘటన పై అందరి ద్రుష్టి పడింది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam