DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 12 నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల నిలిపివేత

*కరోనా రక్షణ ఏర్పాట్లలో టిటిడి మరింత జాగ్రత్తలు*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 7, 2021 (డిఎన్ఎస్):* దేశంలో కోవిడ్ -19 వేగంగా రెండవ దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో  తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్ (ఎస్ఎస్‌డి) టోకెన్ల జారీని ఈ నెల 12 ( సోమవారం )

నుంచి నిలిపివేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం (11-4-2021) సాయంత్రం వరకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తారు.
        కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విష‌యం విదిత‌మే. తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్ర‌మేణా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో

తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో  సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్య‌లో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముంది.
        ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు గమనించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

తదుపరి టోకెన్లు ఎప్పుడు జారీ చేసేది ముందుగా తెలియజేయడం జరుగుతుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam