DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వారిజలో 13 నుంచి ఉగాది, రామ నవమి వేడుకలు

*విశాఖ సాగర తీర ఆశ్రమం ల శ్రీ రామ వైభవ ప్రసరణ.* 

*21 వరకు సుందర కాండ పారాయణ, రామాయణ ప్రవచనం*  
 
*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 9, 2021 (డిఎన్ఎస్):* విశాఖ సాగర తీరం లోని మంగమారిపేట ( భీమిలి బీచ్ రోడ్ ) గల వారిజ ఆశ్రమం లో ఈ నెల 13 నుంచి 21 వరకూ ఉగాది, రామ నవమి వేడుకలు

నిర్వహించనున్నట్టు ఆశ్రమ వేదపాఠశాల అధ్యాపకులు ముడుంబై శ్రీకాంత్ స్వామి తెలియచేసారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అపరరామానుజులు త్రిదండి చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణ లో నిర్వహించబడుతున్న ఈ ఆశ్రమంలోని శ్రీ లక్ష్మి హయగ్రీవమందిరం లో ఈ నెల 13 న ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆరంభమవుతున్నట్టు తెలిపారు. ఆ రోజు నుంచే ఈ నెల

21 వరకూ ఉగాది ప్రయుక్త  శ్రీరామ నవమి ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. 
శ్రీ రామనవమి కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ప్రతీరోజూ ఉదయం 8 గంటల నుంచి 9:30 గం వరకు సుందరకాండ పారాయణం జరుగుతుందని, సాయంత్రం శ్రీ రామాయణ ప్రవచనం ద్వారా సాగర తీర ఆశ్రమం నుంచి శ్రీ రామ వైభవ ప్రసరణ  వైభవంగా జరుగుతుందని వివరించారు.  


వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నారు. ఇతర వివరాలకు వారిజ ఆశ్రమం ఫోన్ నెంబర్లు ( 9247217901 7989762149 ) ల్లో తమను సంప్రదించవచ్చన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam