DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భద్రాచలం లో 20 నుంచి కల్యాణోత్సవాలు, ఏకాంతం లోనే

*20 న ఎదుర్కోలు, 21 న కళ్యాణం, 22 పట్టాభిషేకం* 

*కరోనా 2 వేవ్ ప్రభావంతో నిబంధనలు అమలు లోకి: ఈఓ  *

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*భద్రాచలం / విశాఖపట్నం, ఏప్రిల్ 15, 2021 (డిఎన్ఎస్):* రెండవ దశ కరోనా మరింత విజృంభిస్తున్నందున ఈ నెల 20 నుంచి జరుగవలసిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి

వారి కల్యాణ  ఉత్సవాలు పూర్తిగా ఏకాంతంలో జరుగుతున్నట్టు ఆలయ ఈఓ తెలియచేసారు. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసారు. 
ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం ఈ నెల 20 న ఎదుర్కోలు ఉత్సవం జరగాల్సి ఉంది. 21 న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తీరు కల్యాణ మహోత్సవం, 22 న జరగవలసిన స్వామి వారి మహా పట్టాభిషేకం ఏకాంతంలోనే, కేవలం

ఆంతరంగిక సిబ్బంది సమక్షంలో జరుగుతుందని తెలిపారు. 
భక్తులు ఈ వేడుకల్లో ప్రవేశం లేదని తెలిపారు. భక్తుల ఆరోగ్యం ను దృష్టిలో ఉంచుకుని, ఈ నెల 21, 22  తేదీల్లో ఆలయంలో స్వామివారి అన్ని రకాల దర్శనములను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఉత్సవాలను మీడియా ద్వారా ప్రత్యక్ష  ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. ఇదే నిబంధనలు

ఆలయ అనుబంధ దేవాలయమైన పర్ణశాలలో కూడా అమలు లో ఉంటాయన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam