DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సోనుసూద్ కు కొరోనా, హోమ్ క్వారంటైన్ లో సూపర్ హీరో 

*ప్రజాసేవకు ఎక్కువ సమయం దొరుకుతుంది: సోను సూద్*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 17, 2021 (డిఎన్ఎస్):* సేవ దృక్పథం తోనూ, మానవతా సేవతోను ప్రపంచ దేశాల అభిమానాన్ని పొందిన భారత్ సూపర్ హీరో సోను సూద్ కు కొరోనా పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్టు

ట్విట్టర్ లో స్వయంగా తెలిపారు. శనివారం అయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు పోస్ట్ చేసారు. దీంతో వేలాదిగా అభిమానుల నుంచి    ఫోన్ లు, ఆరోగ్య వివరాలపై సందేశాలతో హోరెత్తిపోతోంది. తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, ఆరోగ్యం నిలకడ గానే ఉందని తెలిపారు. 

తానూ హోమ్ క్వారంటైన్ లో ఉండడం వల్ల  ప్రజలకు సేవ చేసేందుకు ఇప్పుడు

మరింత ఎక్కువ సమయం దొరుకుతుందంటూ చేసిన పోస్ట్ కి అభిమానులు మరింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలిగినా తమ బృందాన్ని సంప్రదించాలంటూ ఆహ్వానం పలికారు. 

గత ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వెళ్లే వలస కూలీలకు నుంచి, ఇతర దేశాల్లో చిక్కుకు పోయిన భారతీయుల వరకూ లక్షలాది మంది

కి తన సహకారం అందించి సురక్షితంగా వాళ్ళని ఇంటికే చేర్చిన ఘనుడు సోను సూద్. దీంతో మొత్తం దేశ పౌరులందరి అభిమానాన్ని పొంది సూపర్ హీరో గా నిలిచిపోయాడు.  

శుక్రవారం కూడా విద్యార్థుల కు మద్దతు గా పరీక్షల పై  సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ముంబయి లో రద్దీ రహదార్ల పై సైకిల్ తొక్కి ఒక సందేశాన్ని

అందించారు. అయితే  శనివారం కొరోనా పాజిటివ్ రావడం గమనార్హం.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam