DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఏపీ ఇంటర్ బోర్డు 

*హైకోర్టు ఆదేశాలకు లోబడి పరీక్షలు వాయిదా.*

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మే 03, 2021  (డిఎన్ఎస్):* ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాయిదా వేసిన నేపథ్యంలో అన్ని జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ బోర్డు  ప్రకటించింది.

ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ పరీక్షలను వాయిదా వేసిన నేపథ్యంలో అన్ని జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. తిరిగి పరీక్షల తేదీలు ప్రకటించే వరకు కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అయితే కొత్త షెడ్యూల్‌

ఎప్పుడు అనేది కూడా స్పష్టం చేసారు. కొత్త షెడ్యూల్‌ను 15 రోజుల ముందుగా విద్యార్థులకు తెలియచేస్తామని చెప్పారు ఈనెల 5 నుంచి జరగాల్సిన ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు (థియరీ) వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam