DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం లో ఆలయ దర్శనం ఇకపై 2 గంటలే: ఈఓ

*ఉదయం 7 :30 నుంచి 9 :30 వరకే భక్తులకు అనుమతి    

*కోవిద్ నిబంధనలతోనే కొత్త జంటల ఆలయ ప్రవేశం* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 06, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దర్శనం ఈ నెల 7 వ తేదీ

నుంచి కేవలం రెండు గంటలు మాత్రమే లభించనుంది. కోవిద్ నిబంధనలకు లోబడి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ తెలియచేసారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ రోజూ ఉదయం 7:30 నుంచి 9:30 మధ్య భక్తులు దర్శించుకోవచ్చునాని తెలిపారు. రెవెన్యూ - దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడమైనదని ఈఓ తెలిపారు.

రోజుకు గరిష్టంగా రెండు గంటలకన్నా ఎక్కువ సమయం భక్తులకు - ఆలయంలోకి అనుమతించొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయన్నారు. భక్తుల సౌకర్యార్థం ఉదయం 7:30 నుంచి 9:30 వరకు అనుమతించబడుతుందని, కోవిడ్ ప్రొటోకాల్ ను పూర్తి స్థాయిలో పాటిస్తూ ఈ రెండు గంటల సమయంలోనే  శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోవాలని ఈఓ

భక్తులకు సూచించారు. 

కాగా ఇటీవలే వివాహం జరిగిన కొందరు నూతన దంపతులు గురువారం పూర్తి నిబంధనలను పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, స్వామిని దర్శించుకున్నారు. 

హుండీ లెక్కింపు వాయిదా . . .  

ఈ నెల 10 , 12 తేదీల్లో జరగాల్సిన శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి హుండీ లెక్కింపును వాయిదా

వేయడమైనదని ఈఓ తెలియచేసారు. లెక్కింపు తేదీలను తర్వాత ప్రకటించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam