DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరి ప్రదక్షిణ భక్తుల సేవలో తరించిన మహానుభావులు 

విశాఖపట్నం, జులై 26, 2018 (DNS Online ): ఆషాఢ శుక్ల పౌర్ణమి ( గురు పౌర్ణమి) ని పురస్కరించుకుని సింహాచలం గిరి ప్రదక్షిణం చేసి 32 కిలోమీటర్ల దూరం నడక ద్వారా ప్రయాణించి సింహాచలం

కొండకు వెళ్లి సింహాద్రి నాధుణ్ని దర్శించుకోవడం ఆనవాయితీ గా వస్తోంది. ఈ క్రమం లోనే గురువారం మధ్యాహ్నం సింహగిరి తొలిపావంచా నుంచి నడక ప్రారంభించిన భక్తులకు

మార్గ మధ్యంలో సేద తీరేందుకు మంచి నీరు, కాఫీ, à°Ÿà±€, కూల్ డ్రింక్స్, వివిధ రకాల ప్రసాదం, పులిహార, పొంగలి, బిర్యానీ, తదితర ఆహార ప్రదార్ధాలను వితరణ చేశారు. 
ఎందరో

మహానుభావులు వీరికి ఈ విధమైన సేవలను వితరణ చేశారు.పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చెయ్యడం జరిగింది,

వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ ( విజెఎఫ్ )

అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కుటుంబ సభ్యులు భక్తుల కోసం వేడి వేడి పొంగలి ఏర్పాటు చేసి విరతరణ చేశారు. గిరి ప్రదక్షిణ ప్రారంభించిన సమయం లో సింహగిరి

తొలిపావంచా వద్ద మంత్రి గంటా శ్రీనివాసరావు తో కలిసి పాల్గొన్న శ్రీనుబాబు, వెంటనే ఈ సేవా కార్యక్రమం లో పాల్గొని అనంతరం గిరి ప్రదక్షిణకు సిద్ద

పడ్డారు. 

వీరి తో పాటు మేము సైతం అంటూ. . . . చిల్లర వర్తక వ్యాపారాలు సాగించేవారు తమ ఉదారతను చాటి స్వామి పట్ల భక్తి ప్రపత్తులను చూపించారు. జామ కాయలు అమ్ముకుని

జీవించే ఒక వృద్ధ మహిళ చూపించిన ఉదారత అందరినీ కదిలించి వేసింది. ఒక పెద్ద బుట్టతో ( సుమారు 400 పళ్ళు) పంచింది, భక్తుల రాక తో మరో పెద్ద బుట్ట నుంచి మరిన్ని దోర జామ

పళ్ళు పంచింది. అవి కూడా త్వరితగతిన పంచిపెట్టడంతో మరో బుట్ట తీసుకువచ్చింది. ఈ క్రమం లోనే ఆమె చేతిలో నుంచి భక్తులు ఒక్కసారిగా మీద పడి లాక్కోవడంతో ఆమె

కాస్తంత ఇబ్బంది పడినా కూడా, స్వామి సేవ అని అనుకోవడం ఆమె ఉదారతకు పరాకాష్ట. ఆమె సేవలను అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది

అభినందించారు. 

#DNS #simhagiri  #VJF #Vizag  #Visakhapatnam   #Simha Giri pradakshina  #Simhachalam #dnslive #dns news 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam