DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు పడే సూచన 

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మే 08, 2021  (డిఎన్ఎస్):* పలు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎండలతో అల్లాడుతున్న ప్రజకలు ఈ వర్షాలతో కొంత ఉపశమనం కలిగిస్తోంది. కాగా.. కొన్ని రోజుల ఉపరితల

ఆవర్తనంతో నుంచి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల పంటలకు, మామిడితోటలకు నష్టం వాటిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనను విడుదల చేసింది. ఈ రోజు, శనివారం, ఆదివారం వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
దక్షిణ కోస్తా ఆంధ్రాలో  శనివారం, ఆదివారం ఉరుములు , మెరుపులతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలో.. కూడా  శనివారం, ఆదివారం ఉరుములు , మెరుపులతో ఒక

మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాంకుండా పలుచోట్ల పిడుగులు పడే సూచనలు కూడా ఉన్నాయని తెలిపింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam