DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహద్రినాథుని నిజరూప దర్శనం సంచయిత, ముత్తంశెట్టికే  

*అనివార్య కారణాల వల్ల వెల్లంపల్లి స్థానంలో అవంతికి చోటు* 

*సింహాచలం చందనోత్సవం పూర్తిగా ఏకాంతమే..*

*అందరి తరపున అర్చకులు ఆరాధనలు నిర్వహిస్తారు.*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 12, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు గా కొనియాడబడుతున్న

శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి, దేవస్థానం సింహాచలం ఆలయంలో ఈ నెల 14వ తేదీన చందనోత్సవం నాడు స్వామి దర్శనం కేవలం ధర్మకర్త సంచయిత, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కి మాత్రమే లభిస్తుందని ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ తెలిపారు. ఆలయ నియమాల ప్రకారం చందన యాత్ర రోజున మొదటి దర్శనం ధర్మకర్త సంచయిత గజపతి చేసుకోనున్నారు. 
/> తదుపరి ప్రభుత్వం తరపున ఒకరు రావాల్సి యుందీ. సింహాచలం లో స్వామి నిజరూప దర్శనం రోజున ముందుగా. ప్రకటించిన ఆదేశాల ప్రకారం దేవాదాయ శాఖ మంత్రి. వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రభుత్వ ప్రతినిధిగా. రావాల్సి ఉంది.

అయితే అనివార్య కారణాల వల్ల ఆయన రాలేని పరిస్తితి వల్ల. ఆయన స్థానం లో ప్రభుత్వ ప్రతినిధిగా స్థానిక మంత్రి

అవంతి శ్రీనివాస్ హాజరుకానున్నారు

మిగిలిన ఆరాధనలు, అర్చనలు పూర్తిగా ఏకాంతంలోనే జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు కోవిడ్ నిబంధనల వల్ల ఏకాంతంగానే ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 
ఏడాది పొడవునా సుగంధ చందనంలో ఉండే స్వామి ఒక్క చందనోత్సవంనాడే  నిజరూప దర్శనమివ్వనున్నారు. ఆలయ

సంప్రదాయం ప్రకారం తొలి దర్శనం ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి కి కల్పించనున్నాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి  స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.  

దురదృష్టమైన కోవిడ్ కారణాల నేపథ్యంలో  మిగతావారికి 14వ తేదీన కొండపైకి అనుమతి ఉండదని గమనించగలరు. చందనయాత్ర నిర్వహణకు అవసరమయ్యే ఆలయ

ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేక పాసులతో కొండపైకి అనుమతించనున్నాము. 
ట్రస్టు బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులకు సైతం చందనోత్సవం రోజు అనుమతి లేదు. మీడియాకు, మీడియా ప్రతినిధులకు కూడా కొండపైకి అనుమతిలేదు. ప్రభుత్వ ఆదేశాలమేరకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడమైనదన్నారు. 

చందనోత్సవ ప్రధాన ఘట్టాలను

(కళ్యాణమండపం) లైవ్ లో చూసే ఏర్పాట్లు ఆలయ అధికారులు చేస్తున్నారు. లక్షలాదిమంది ప్రత్యక్షంగా పాల్గొనే చందనయాత్ర ... ఏకాంతంగా నిర్వహించాల్సిరావడం బాధాకరమే. కోవిడ్ మహమ్మారి దూరమై... వచ్చే ఏడాదైనా భక్తులతో కలకలలాడేలా ఉత్సవాన్ని జరుపుకునేలా చేయాలని ఆ సింహాద్రినాథుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam