DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చందన యాత్రలో ఆలయం విధుల్లో అందరికి డ్యూటీలు లేవా? 

*సహస్ర ఘటాభిషేకం విధుల్లో యువ అర్చకులు లేరా?* 

*యువకుల సేవలు తీసుకు ఉంటె. .సహాయకారిగా ఉండేది.* 

*ఆరోగ్యంగా ఉన్నా పదిమందికి విధుల్లేవు, ఆవేదనలో అర్చకులు* 

*క్వారంటైన్ సెలవులో ఉన్నవారికి డ్యూటీ వేస్తె చెయ్యగలరా?*

(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)

 

విశాఖపట్నం, మే 13, 2021 (డిఎన్ఎస్): ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు గా కొనియాడబడుతున్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి, దేవస్థానం సింహాచలం ఆలయంలో ఈ నెల 14వ తేదీన చందనోత్సవం వేడుకల్లో విధుల కేటాయింపులో యువ అర్చకుల సేవలు కూడా తీసుకుని ఉంటె  మరింత సహాయకారిగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

విధులు

కేటాయింపులు జరిగిన వాళ్లలో అధిక శాతం వృద్దులు కావడం గమనార్హం. అయితే పూర్తి ఆరోగ్యంగా ఉండి, సాధారణ విధుల్లో ఉన్న యువ అర్చకులు పదిమందికి ఈ వేడుకల్లో విధులు కేటాయించకపోవడం ఆవేదన చెందుతున్నారు. ఏడాదిపాటు స్వామికి సేవచేసే తమకు, చందనయాత్ర విధులు లేకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అర్చనాది

వైదిక విధుల్లో వృద్ధులు, నడివయసు దాటినా వైదిక సిబ్బంది విధులు నిర్వహించగలిగే అవకాశం ఉంది. అయితే సహస్ర ఘటాభిషేకం విధులను కేవలం 10 మంది వృద్దులు ( నడి వయస్సు దాటిన వారు ) కు కేటాయించడం కొంచెం ఇబ్బంది కరంగానే ఉండవచ్చు. వీరంతా గంగ ధార నుంచి 1000 కలశలతో నీటిని గర్భాలయానికి తీసుకు రావాల్సి ఉంటుంది. ప్రతి కలశను గంగాధర నుంచి

తీసుకురావాల్సి ఉంటుంది. ఈ విధులను యువ అర్చకులకు కేటాయించినట్టయితే, కొంచెం వేగవంతంగా అభిషేకం జరిగే అవకాశం ఉంటుంది. పైగా గంగాధర నుంచి త్వరితగతిన, తక్కువ సమయంలోనే తీర్ధం గర్భాలయాని చేరుతుంది. ఇలాంటి మహోన్నత కార్యక్రమం లో వయో వృద్ధులైన వారిని ఈ విధుల్లో నియమించడం ద్వారా వారికీ ఇబ్బంది కలిగే అవకాశం కూడా

ఉంది. 

అయితే రెగ్యులర్ సిబ్బందిని కాదని, డైలీ లెక్కన, తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న వారికి చందన యాత్ర డ్యూటీ వెయ్యడం తో యువ వైదిక సిబ్బంది ఆవేదన చెంతున్నట్టు సమాచారం. 

గత కొన్ని రోజులుగా క్వారంటైన్ సెలవులో ఉన్నవారికి డ్యూటీ వేసినట్టు తెలుస్తోంది. అయితే వారికి తగ్గినా, కొంత విశ్రాంతి

అవసరమున్న ఈ సమయంలో ఈ విధుల్లో పూర్తిస్థాయి సేవలు ఎంతవరకూ అందించగలరో ఆలయ స్థానాచార్యులు చెప్పాల్సి ఉంది.

యువ అర్చకులకు పాస్ లేని కారణంగా కొండా దిగువునే నిరోధించడం జరిగింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam