DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం ఘటాభిషేకం ఫలితం వైష్ణవ స్వాములందరికీ లభిస్తుంది 

*ప్రతిసారీ ఈ సేవలో పాల్గొనే స్వాములకు అనుగ్రహం లభిస్తుంది*

*చందనయాత్రలో ప్రధాన ఘట్టం సహస్రఘటాభిషేకం*

*సింహాచల క్షేత్ర ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణ* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 14, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పుగా

కొనియాడబడుతున్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి సింహాచలం క్షేత్రం లో అత్యంత పవిత్రమైన సహస్ర ఘటాభిషేకం ఫలితం మొత్తం శ్రీవైష్ణవ స్వాములందరికీ లభిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు తెలియచేసారు. ఈ ఉత్సవం ప్రతి ఏడాది వందలాది మంది శ్రీవైష్ణవ స్వాములందరి సహకారంతో శోభాయాత్రగా వేదపారాయణ

చేస్తూ వైభవోపేతంగా జరిగేదన్నారు. అయితే ప్రస్తుతం కొరోనా మహమ్మారి ప్రభావంతో ఎవరికీ ఆలయ ప్రవేశం లేకపోవడంతో కేవలం వైదిక సిబ్బంది మాత్రమే ఈ సేవను నిర్వరిస్తున్నారన్నారు. ముందుగానే గంగాధర నుంచి జలం తీసుకు వచ్చిన కలశలను స్వామికి ఎదురుగా గల ప్రాంగణంలోనే క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం ఆరాధనల అనంతరం

ఘటాభిషేకం నిర్వహించారు.  

మొత్తం వైష్ణవ స్వాములందరి తరపున వైదిక సిబ్బంది ఈ సేవచేస్తున్నారని, అయితే ఈ ఫలితం మాత్రం మొత్తం స్వాములందరికీ లభిస్తున్నారు. ఎంతో కోలాహలంగా ఉండే ఘటాభిషేకం కేవలం ఏకాంతంలో జరుగుతోందన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam