DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గంటా పార్టీ మార్పు ఖాయమేనా ? గంటా తీరు రాజప్ప కు నచ్చలేదా

మంత్రి పదవి కంటే పార్టీ యే ముఖ్యం : రాజప్ప సీరియస్ 

విశాఖపట్నం, జులై 27, 2018 (DNS Online ): రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి మారడం

ఖాయంగానే కనిపిస్తోంది. ఇది ఎవరో చెప్పే మాటలు కాదు. తెలుగుదేశం పార్టీ లోని కీలక మంత్రుల అభిప్రాయమే ఇది.
రాష్ట్ర మంత్రి పదవి కంటే పార్టీ సమావేశాలే ఎక్కువని,

పార్టీ విజయం సాధిస్తేనే ఎం ఎల్ ఏ పదవైనా సరే, మంత్రి పదవైనా సరే వచ్చేది అని జిల్లా ఇంచార్జి మంత్రి ఎన్. చిన్న రాజప్ప తెలుగుదేశం పార్టీ సమావేశం లో తెలిపినట్టు

సమాచారం. 
గురువారం నగరం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో జిల్లా ఇంచార్జి మంత్రి, ఎన్. చిన్న రాజప్ప అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ

సమావేశానికి జిల్లా లోని మరో మంత్రి సి హెచ్. అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే లు వాసుపల్లి గణేష్, పంచకర్ల రమేష్, వెలగపూడి రామకృష్ణ, వి. అనిత, బండారు సత్యనారాయణ, సహా ఎస్ ఏ

రెహమాన్, సుమన, ఇతర ముఖ్య నేతలు హాజరు కాగా, జిల్లాలో చక్రం త్రిప్పుతున్న గంటా మాత్రం హాజరు కాక పోవడం గమనార్హం. దీనిపై సమావేశం లో నేతలు హోమ్ మంత్రి ని

నిలదీసినట్టు తెలుస్తోంది. ముందుగా సమాచారం యిచ్చినప్పడికీ గంటా రాకపోవడం పై సాక్షాతూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని సభ్యులకు హామీ ఇచ్చినట్టు

తెలుస్తోంది. గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు నగరం లోనే ఉన్నప్పటికీ పార్టీ అత్యవసర సమావేశానికి హాజరు కాకుండా కొన్ని ప్రయివేట్, ప్రభుత్వ కార్యక్రమాలలో

పాల్గొనడం పై  à°°à°¾à°œà°ªà±à°ª మండిపడ్డారు. విలేకరుల సమావేశం లో సైతం రాజప్ప అసహనాన్ని బహిర్గతంగానే ప్రకటించారు. పార్టీ సమావేశాలకు ఎవరు రాకున్నా, నిర్వహిస్తాం. ఆయనకి

బోలెడన్ని మీటింగులు, పనులూ ఉంటాయి, అయన చాలా బిజీ అందుకే రాలేదని, ఇదే విషయాన్ని ఆయన్నే అడగమని సూచించారు. దీంతో గంటా తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యేందుకు

తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టు గానే తెలుస్తోంది. దీనికి బలాన్ని చేకూరుస్తున్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యన్నారాయణ

విలేకరుల సమావేశం లో పార్టీలోకి ఎవరు వచ్చినా పార్టీ తలుపు తెరిచే ఉన్నాయని చెప్పడమే. 


#DNS #VJF #TDP #Vizag  #Visakhapatnam  #Telugudesam  #Telugu Desam # Home #Andhrapradesh #Ganta #Srinivas

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam