DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కర్ఫ్యూ వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి: మంత్రి ఆళ్ల

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మే 17, 2021  (డిఎన్ఎస్):* కర్ఫ్యూ వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల

వరకే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స చేయాలని సీఎం ఆదేశించాదన్నారు. పాజిటివ్ పేషంట్ల గుర్తింపు కోసం ఫీవర్ సర్వే చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత పకడ్బంధీగా ఫీవర్ సర్వే

నిర్వహిస్తున్నామన్నారు. సర్వేలో గుర్తించిన వారిలో అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తామని మంత్రి ఆళ్లనాని చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam