DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూలికలు అవే అయినా తయారీ లో తేడాలు ఉంటాయి

*నిర్వాహకుల అనుభవమే మందు తయారీలో కీలకం.*

*కొరోనాను అదుపు చెయ్యడంలో అల్లోపతి అట్టర్ ఫ్లాపేనా? 

*ఆనందయ్య మూలికా వైద్యం పై సాగుతున్న రచ్చరచ్చ* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 22, 2021 (డిఎన్ఎస్):* కొరోనాను అదుపు చెయ్యడంలో అల్లోపతి వైద్యం అట్టర్

ఫ్లాపేనా అంటే అవుననే అంటున్నారు ప్రజానీకం. దాదాపుగా చాలామంది ఇదే అభిప్రాయానికి వచ్చేసినట్టే కనపడుతోంది. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా వేదికగా సాగుతున్న చర్చలు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చేరుతున్న వేలాది అంబులెన్స్ లు, వాహనాలు, ట్రాఫిక్ జామ్ లు.  

లక్షలాదిగా రూపాయలు ఫీజులు వసూలు

చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు మనుషుల ప్రాణాలకు గ్యారంటీ కూడా ఇవ్వకపోవడంతో చాలామంది అప్పులపాలై రోడ్డెక్కిన పరిస్థితులను ప్రత్యక్షంగానే చూస్తున్నాం. దీన్ని అదుపుచేయడం, అరికట్టడం చేతగాని ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఉచితంగా ఇస్తున్న నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద వైద్యాన్ని తక్షణం నిలుపుదల చెయ్యడంలో

అత్యుత్సాహాన్ని చూపించారు అనడం అతిశయోక్తి కాదు. 

ఇప్పడికే కృష్ణపట్నం మేజర్ పంచాయితీ లో ఒక్క కొరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడానికి ప్రధాన కారణం ఆనందయ్య ఆయుర్వేద వైద్యమే అంటున్నారు ప్రాంత జనం. దీంతో ఇతర జిల్లాల నుంచే కాకా రాష్ట్రాల నుంచి సైతం వేలాది ప్రజలు కార్లు, బళ్ళు తో రావడమే కాకుండా, సుమారు 2

వేల అంబులెన్సుల్లో చికిత్స పొందుతున్న రోగుల్ని కూడా ఈ ప్రాంతాన్ని వెంటపెట్టుకు వచ్చారు. దీంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

మెడికల్ మాఫియా ఒత్తిళ్లు తో నేరుగా పాలకులే రంగంలోకి దిగి ఆనందయ్య వైద్యం పై శల్య పరీక్ష చెయ్యాలని వైద్య రంగాన్ని రంగంలోకి దింపారు. 

ఆనందయ్య మొదటి నుంచే తానూ చేసే

వైద్యాన్ని, మందు లో కలిపే మిశ్రమాల మూలికల  వివరాలను బహిరంగంగానే ప్రకటించారు. 
అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ప్రభుద్దులు తాము తయారు చేసే మందుల్లో ఈ మూలికలు ఉన్నాయంటూ ఇప్పడికే మార్కెట్ లో అమ్మకాలు మొదలుపెట్టేశారు. 

అవే మూలికలు అయినా. . తయారీ లో తేడాలు. .

ఆనందయ్య తానూ వాడే ఆయుర్వేద

మూలికలు పేర్లు చెప్పినా, ఆ మందు ఎవడు పడితే వాడు తయారు చెయ్యలేడు. దాని మహత్తు అది తయారు చేసే వల్ల మదిలో నుంచి వస్తుందన్నది చాలా మందికి తెలియని విషయం. 
మందు తయారీలో ప్రధానంగా నిర్వాహకుల అనుభవం, వారి ఆలోచన సరళి పై పూర్తిగా ఆధార పడి ఉంటుంది. అవే మూలికలు అయినప్పడికి తగిన పాళ్లు కలపడంలో ఎన్నో తేడాలు ఉంటాయి. కాబట్టి

ఆనందయ్య మందు ఆయనకే ప్రత్యేకం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam