DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*బ్లాక్ అండ్ వైట్ మీడియా సేవలు భేష్: మేయర్ హరి కుమారి*

*విశాఖపట్నం, మే 30, 2021 (డిఎన్ఎస్):* కరోనా విపత్కర పరిస్థితుల్లో  అన్నదానం చేయడం చాలా మంచిదని మహా విశాఖ నగరపాలక సంస్థ  మేయర్  గొల్లగాని హరి వెంకట కుమారి అన్నారు.  బ్లాక్ అండ్ వైట్ మీడియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అన్న వితరణ కార్యక్రమంలో  మేయర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు 
కార్యక్రమాలలో భాగంగా ఆది

వారం మహ విశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారి, జనసేన ఉత్తరాంధ్ర కన్వీనర్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు చేతుల మీదుగా  ఆహారం పంపిణీ కార్యక్రమం చేపట్టరు.
మధురవాడ మారికవలస మొదలుకుని గాయత్రి హాస్పిటల్, ఆరిలోవ విన్స్ హాస్పిటల్, పరిసర ప్రాంతాల్లో కోవిద్ బాధితులకు సహాయకులుగా వచ్చిన వారు పారిశుద్ధ్య సిబ్బందికీ , మద్దిలపాలెం

జంక్షన్, ఆర్ టీసీ కాంప్లెక్స్, డాబాగార్డెన్స్ జగదాంబాజంక్షన్ వరకూ రహధారుల ప్రక్కన ఉన్న నిరస్రాయులకు ఆహార పొట్లాలు  పంపిణీ చేయడమైనది. విధి నిర్వహణలో ఉన్న  పోలీస్ శాఖ సిబ్బందికి  కూడా   ఆహారం పొట్లాలను  ను అందజేశారు   ఈ ఆహార పొట్లాలు స్వీకరించి వారు  సంస్థ  చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు . 


సందర్బంగా హరి వెంకట కుమారి, డాక్టర్ బొడ్డేపల్లి రఘు మాట్లాడుతూ బ్లాక్ అండ్ వైట్ మీడియా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అండ్ వైట్ మీడియా స్వచ్ఛంద  సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు పిళ్ళా విజయ్ కుమార్, ఆనందరావు సభ్యులు వికాస్ కుమార్,

 నరసింహ చైతన్య, , సీనియర్ జర్నలిస్టు ఎం ఎస్ ఆర్ ప్రసాద్ ,  రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వితరణ కార్యక్రమంలో చందోలు ఆశాలత అహరానికి అవసరమైన వనరులను సమకూర్ఛారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam