DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆనందయ్య మందు పంపిణీపై ఎందుకు తాత్సారం? 

*ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోమారు ఆగ్రహం*

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, మే 31, 2021 (డిఎన్ఎస్):* నెల్లూరు ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య అందిస్తున్న కరోనా మందు పంపిణీపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుతాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సోమవారం జరిగిన వాదప్రతివాదనల్లో

ఆనందయ్య మందు పంపిణీ నిలుపుదలకు సంబంధించి ఆర్డర్స్ ను ఎందుకు ఉంచలేదని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు రోజులు సమయం కోరినప్పటికీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు ఉత్తర్వులు ఎందుకు ఉంచలేదన్న రాష్ట్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 నిమిషాలలో ధర్మాసనం ముందు ప్రభుత్వ ఉత్తర్వులు ఉంచాలని ఆదేశాలు జారీ

చేసింది.  
ఆనందయ్య మందు పంపిణీ విచారణ 15 నిమిషాలు వాయిదా

సిగరేట్స్, మందు హానికరం అని తెలిసినా అభ్యంతరం చెప్పని ప్రభుత్వం ఇపుడు ఆనందయ్య మందు పంపిణీకి ఎందుకు అభ్యంతరం చెబుతుందో సమాధానం చెప్పాలని న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఆనందయ్య మందు హానికరం కాదని కేంద్రం తెలిపినట్టు

ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam