DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈఓ ఆకస్మిక తనిఖీలతో సింహాచలం సిబ్బంది బేజారు

*సింహగిరి పరిధిలో విస్తృత పర్యటనల్లో ఈఓ సూర్యకళ* 

*ఫిర్యాదులపై తక్షణ పరిష్కార దిశగా సిబ్బంది కి సూచనలు*

*మొద్దు నిద్రపోతున్న విభాగాల్లో అలజడి, ఆందోళనలు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 01, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లా ల ఆరాధ్యదైవమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ

స్వామి దేవస్థానం, సింహాచలం పరిధిలోని అన్ని విభాగాలూ ఎటువంటి లోపం లేకుండా విధులు నిర్వహించాల్సిందేనని ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమం లోనే భాగంగా దేవస్థానం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటిస్తూ సిబ్బంది పని తీరును స్వయంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఇంతకాలం మొద్దు నిద్ర పోతున్న

విభాగాల్లోని సిబ్బంది లో ఆందోళన మొదలయ్యింది. మంగళవారం నీటి సరఫరా విభాగంలోని అన్ని కీలక ప్రాంతాలను ఆమె పరిశీలించారు. యంత్రాల పనితీరు, సిబ్బంది నిర్వహణ విధానం స్వయంగా చూసి తెలుసుకున్నారు. కొన్ని సూచనలు చేసారు. 

మంగళవారం తెల్లవారు జామున  కొండపైన , మెట్లమార్గంలో వాటర్ వర్క్స్, మంచినీరు ఎలా ఎక్కడ నుంచి

వస్తోంది, ఎంత స్టోరేజ్ జరుగుతోంది, వృథా ఏమైనా ఉందా అన్న అంశాలపై ఆకస్మిక తనిఖీ చేశారు. గంగధార, నాగధార (అనంతధార) , శవధారలను పరిశీలించారు.  మెట్ల మార్గంలోని ఆకాశధార, చాకిధార, హనుమంతధార, చక్రధార, శంకధార, పిచ్చుక ధార, వేగవతి ధారలను పరిశీలించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి వినియోగించుకోవాలని ఆమె సూచించారు. వాటర్

స్టోరేజ్ కెపాసిటీ పెంచాలన్నారు.  మాధవధార, సీతమ్మధారల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటర్ స్టోరేజ్ విషయంలో పరిశుభ్రత పాటించాలన్నారు. 
భక్తుల నుంచి ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా, దాన్ని పరిశీలించి, సత్వర పరిష్కారం చూపుతున్నారు. బస్టాండ్ లో ఫ్యాన్ తిరగలేదని, కళ్యాణమండపాన్ని, క్యూలైన్లు, క్లీన్ డ్రైవ్ ను

 పరిశీలిచారు. 
     మెట్ల మార్గంలోనూ కలియదిరుగుతూ... భక్తులకు ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయో పరిశీలించారు. ఎండలెక్కువగా ఉన్నాయని... ఉదయ 7:30 నుంచి 11:30 వరకు దర్శనాలుంటాయని... కాబట్టి భక్తులకు  మంచి నీటి వసతి కల్పించాలని  ఆదేశించారు.  సింహాచలంలోని ధారల్లో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని.. వాటిని ఎట్టి

పరిస్థితుల్లోనూ వృథా చేయొద్దని ఆమెతోపాటున్న వాటర్ వర్క్స్  ఏఈకి సూచించారు. సింహాచలంలోనున్న శాసనం  గంగాధార సమం తీర్థం, క్షేత్రం సింహాద్రి నా సమం, నరసింహ సమో దేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయ: ను అందరూ గుర్తించి పనిచేయాలని సూచించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam